AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరాశివారు అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (March 23 2022) : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు.

Horoscope Today: ఈరాశివారు అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Basha Shek
|

Updated on: Mar 23, 2022 | 4:51 AM

Share

Horoscope Today (March 23 2022) : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 23వ తేదీ ) బుధవారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి

ఈరాశివారు శ్రమతో కూడిన సత్ఫలితాలను అందుకుంటారు. అయితే బంధు, మిత్రులతో కాస్త ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. లక్ష్మీ స్తోత్రం చదవడం వల్ల మంచి కలుగుతుంది.

వృషభరాశి

శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీకున్న గొప్ప ఆలోచనా సామర్థ్యంతో జీవితంలో అనుకున్న పనులు సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. మీ జీవితానికి సంబంధించి ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచుతుంది. శివుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

మిథున రాశి

కృషి, పట్టుదలతో కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అదేవిధంగా కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్టదేవతాలను ఆరాధిస్తే మరింత మేలు కలుగుతుంది.

కర్కాటక రాశి

ఆశించిన ఫలితాలు అందుకోవడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. లైఫ్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. దుర్గాదేవి శ్లోకాన్ని పఠిస్తే మంచి చేకూరుతుంది.

సింహ రాశి

అలసట పెరుగుతుంది. పనుల్లో విఘ్నాలు ఎదురవకుండా చూసుకోవాలి. మొహమాటాన్ని దూరం పెట్టండి. బంధువుల సూచనలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. లక్ష్మీగణపతిని పూజిస్తే శుభం కలుగుతుంది.

కన్య రాశి

మీకున్న ఆలోచనా సామర్థ్యంతో సమయానికి అనుకున్న పనలు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. క్టిష్టమైన పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అయితే ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఇష్టదేవతలను ఆరాధించడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి.

తుల

ఈరాశివారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. శత్రువులపై పై చేయి సాధిస్తారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. హనుమంతుడిని దర్శించుకుంటే మంచి కలుగుతుంది.

వృశ్చిక రాశి

అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ధనుస్సురాశి

ప్రారంభించిన పనులలో ఆటంకాలు పెరుగుతాయి. ఇబ్బందులు ఎదురవుతాయి. స్నేహితులు, సన్నిహితుల్లో కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మనోబలం కోల్పోకుండా చూసుకోవాలి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు చికాకు తెప్పిస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది.

మకరరాశి

ఒక మంచివార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అయితే అనవసర వివాదాలు, గొడవల్లో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన మర్చిపోకండి.

కుంభ రాశి

ఈరాశివారికి శుభకాలం నడుస్తోంది. అనుకున్న పనులు పూర్తి చేస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబీకులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా ఫఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

ఈరాశివారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తిచేస్తారు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసుకుంటారు. వాటిని ప్రారంభించడంలో చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం పనికిరాదు. శ్రీనివాసుడిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!

Andhra Pradesh: అలా అయితే ఆయన చాలాసార్లు చెప్పుతో కొట్టుకోవాలి.. మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్..!

Central Silk Board Jobs: సెంట్రల్‌ సిల్క్‌ బోర్డులో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌ ఆధారంగా ఎంపిక..