Central Silk Board Jobs: సెంట్రల్ సిల్క్ బోర్డులో సైంటిస్ట్ ఉద్యోగాలు.. గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక..
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డు (CSB).. సైంటిస్ట్ బి (Scientist B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Central Silk Board Scientist B Recruitment 2022: భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డు (CSB).. సైంటిస్ట్ బి (Scientist B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సైంటిస్ట్ బి పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: ఏప్రిల్ 25, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: టెక్స్ టైల్ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్ 2022లో అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.1000
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: