- Telugu News Photo Gallery Are You eating Yogurt to prevent heat but should not combine curd with these 5 foods
Yogurt Side Effects: మామిడి పండుతో పెరుగన్నం తింటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..
చాలా మంది దోసకాయ, యాపిల్, ద్రాక్ష పండ్లను పెరుగులో కలిపి తింటుంటారు. ఐతే ఈ పండ్లను అస్సలు పెరుగుతో కలిపి అస్సలు తినకూడదు. అవేంటంటే..
Updated on: Mar 22, 2022 | 8:41 PM

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా (beneficial bacteria) పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా పెరుగులో కాల్షియం, విటమిన్ బి-2, విటమిన్ బి-12, మెగ్నీషియం, పొటాషియం (potassium) వంటి పోషకాలు అధికమే. అందువల్లనే పెరుగు సులభంగా జీర్ణమవుతుంది. చాలా మంది దోసకాయ, యాపిల్, ద్రాక్ష పండ్లను పెరుగులో కలిపి తింటుంటారు. ఐతే ఈ పండ్లను అస్సలు పెరుగుతో కలిపి అస్సలు తినకూడదు. అవేంటంటే..

చాలా మంది పరోటాను పెరుగు రైతాతో తింటారు. ఈ విధంగా తినడం వల్ల గ్యాస్ ఫామయ్యి జీర్ణక్రియ సమస్యలకు దారి తీస్తుంది. పరోటాతో పాటు ఆయిల్ ఫుడ్, పెరుగు కూడా తినకూడదు. ఇలా తింటే నిద్ర అధికంగా వస్తుంది.

పండు మామిడికాయతో పెరుగు తినడానికి చాలా ఇష్టపడతారు. ఐతే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలుసా? మామిడికాయ, పెరుగు కలిపి తింటే శరీరం చల్లగా ఉంటుంది. దీనితోపాటు చర్మ సమస్యలు తలెత్తుతాయి.

పెరుగు చేపలంటే మనందరికీ ఇష్టమే. పుల్లటి లేదా తీపి పెరుగుతో చేపలను తింటే వెజిటబుల్ ప్రొటీన్లు, యానిమల్ ప్రొటీన్లు కలిసిపోయి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. తిన్నా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. పాలు, చేపలు కూడా కలిపి తినకూడదు.

దోసకాయ, బూందీతో పెరుగు చట్నీ చేసుకోవచ్చు. ఐతే దీనిలో ఉల్లిపాయ అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే..పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఉల్లిపాయ శరీరాన్ని వెచ్చపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు (పెరుగు-ఉల్లిపాయను) కలిపి తింటే ఎలర్జీ సమస్యలు, ఎగ్జిమా తదితర చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

పాలు, పెరుగు కూడా కలిపి తినకూడదు. ఇవి జీర్ణం కావడం చాలా కష్టం. గ్యాస్ వచ్చి, గుండెల్లో మంట పుడుతుంది.




