AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: అబ్బబ్బా.. వారికి ఆకస్మిక ధన లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

ఏప్రిల్ 11, 2026 శనివారం రాశిఫలాల ప్రకారం ఉద్యోగులు మంచి అవకాశాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. చాలా రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో పురోగతి, ఆదాయం పెరుగుదల కనిపిస్తుండగా, కొందరికి చిన్నపాటి ఒత్తిడులు ఉన్నప్పటికీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ, ఆర్థిక విషయాల్లో ఎక్కువగా అనుకూలత ఉండే రోజు గా భావించవచ్చు.

Horoscope Today: అబ్బబ్బా.. వారికి ఆకస్మిక ధన లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashifal In Telugu 11 April 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఏప్రిల్ 11, 2026): ఉద్యోగులు మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సహచరులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులు మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎటువంటి ప్రయత్నం చేసినా ఫలించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సహచరులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతిఫలం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఎవరితోనూ తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. ఇరుగు పొరుగుతో వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పనిభారం చాలా వరకు తగ్గుతుంది. గౌరవాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా పుంజుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. వివాహ ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లల్లో ఒకరు చదువుల్లో గానీ, ఉద్యోగంలో గానీ పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరిగే సూచనలున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొన్ని లోటుపాట్లు చోటు చేసుకోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభిస్తుంది. ప్రయాణాల్లో వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. లాటరీ, షేర్లు, వడ్డీ వ్యాపారం వంటి వాటి వల్ల ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మీ ప్రయత్నాలు, నిర్ణయాలు ఫలిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయ. వ్యాపారాలు నిదానంగా పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వాద వివాదాల్లో తలదూర్చవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవహారాలు చురుకుగా ముందుకు సాగుతాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో డబ్బు నష్టపోతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి అనుకోకుండా శుభవార్త అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధపెట్టడం అవసరం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. వాగ్దానాలు చేయడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదు. ఆరోగ్యం బాగా నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రావాల్సిన బాకీలు, బకాయిలు పూర్తిగా చేతికి అందుతాయి. చాలావరకు అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టడం మంచిది. సన్నిహితులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగం ఉత్సాహంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేయడంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగడం శ్రేయస్కరం కాదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన లాభం పొందు తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆర్థిక ప్రయత్నాల వల్ల లాభం పొందుతారు. కొద్దిపాటి శ్రమ, తిప్పటలతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

Follow Us