TTD Alert: శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు నకిలీ వీఐపీ దర్శనం టికెట్ల మోసంపై హెచ్చరిక జారీ చేసింది. సెంథిల్ కుమార్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ లోగోతో నకిలీ ప్రకటనలు సృష్టించి, ఒక్కో టికెట్‌కు రూ.16,500 వరకు వసూలు చేశాడు. భక్తులు అటువంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని టీటీడీ సూచించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక జారీ చేసింది. నకిలీ వీఐపీ దర్శనం టికెట్లతో మోసం చేసే ముఠాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో జరుగుతున్న మోసాలకు సంబంధించి సెంథిల్ కుమార్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను టీటీడీ లోగోను ఉపయోగించి నకిలీ ప్రకటనలను సృష్టించాడు. ఈ మోసగాడు భక్తులకు ఐదు అడుగుల దూరం నుంచి శ్రీవారి దర్శనం కల్పిస్తానని నమ్మబలికాడు. ఒక్కో వీఐపీ దర్శనం టికెట్‌కు రూ.16,500 వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల పోలీస్ స్టేషన్లలో సెంథిల్ కుమార్ పై పలు కేసులు నమోదు చేయబడ్డాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adilabad Airport: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
చెన్నై సమీపంలో గోల్డ్ షాపులో దోపిడీకి యత్నం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

