తొక్కే కదాని పడేస్తే.. కోట్ల విలువైన లాభాలు చేజారినట్లే!
10 April 2026
TV9 Telugu
TV9 Telugu
నారింజ పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. నారింజ పండ్లను కొందరు నేరుగా తింటే, కొందరు జ్యూస్‌లా తయారు చేసి తీసుకుంటారు
TV9 Telugu
అయితే నారింజ పండ్లు మాత్రమే కాదు వాటి తొక్కలు కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని పరిశోధనల్లో తేలింది. నారింజ పండు తొక్కలతో టీ తయారు చేసి తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చట
TV9 Telugu
నారింజ పండ్లను తిన్న వెంటనే తొక్కను పడేస్తారు. కానీ ఆ తొక్కలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. నారింజ పండు తొక్కలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, లైమోనీన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, అంతర్గత వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. నాడీ సంబంధ వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు
TV9 Telugu
నారింజ పండు తొక్కలతో తయారు చేసిన టీని తాగితే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో చర్మ కణాలు పునరుత్తేజం చెందుతాయి. ఫలితంగా యవ్వనంగా కనిపిస్తారు
TV9 Telugu
కాంతివంతంగా చర్మం మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. నారింజ పండు తొక్కలను పేస్ట్‌లా చేసి పలు రకాల ఫేస్ ప్యాక్‌లలోనూ ఉపయోగించవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
TV9 Telugu
నారింజ పండు తొక్కల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
ఈ తొక్కల్లో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దీంతో శరీరం సీజనల్ వ్యాధులపై పోరాటం చేస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి తగ్గిపోతాయి. వీటిల్లోని ఫ్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు