AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాట విజయ్ చరిత్ర తిరగరాస్తారా.. డీఎంకే, అన్నా డీఎంకేకు షాక్ తప్పదా..?

తమిళనాట టీవీకే పార్టీ ఎఫెక్ట్ రెండు ప్రధాన పార్టీలకు గట్టిగానే తగిలేట్టు ఉంది. తొలిసారి బరిలో ఉన్న దళపతి విజయ్‌కు ఏమాత్రం కలిసి వస్తుంది అన్నది అలా ఉంచితే, ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలకు మాత్రం గట్టి దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సర్వేలు తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు తప్పదని సూచిస్తున్నాయి.

తమిళనాట విజయ్ చరిత్ర తిరగరాస్తారా..  డీఎంకే, అన్నా డీఎంకేకు షాక్ తప్పదా..?
Aiadmk,dmk, Tvk
Ch Murali
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 10:14 PM

Share

తమిళనాట టీవీకే పార్టీ ఎఫెక్ట్ రెండు ప్రధాన పార్టీలకు గట్టిగానే తగిలేట్టు ఉంది. తొలిసారి బరిలో ఉన్న దళపతి విజయ్‌కు ఏమాత్రం కలిసి వస్తుంది అన్నది అలా ఉంచితే, ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలకు మాత్రం గట్టి దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సర్వేలు తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు తప్పదని సూచిస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొత్తగా పార్టీ విజయ్ వైపు వెళితే, అది అన్నాడీఎంకేకు కలిసి రావాలి.. కానీ తమిళనాట అది జరుగుతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో ఇటు ఏఐడీఎంకే, అటు అధికార డీఎంకే రెండు పార్టీలను గుబులు పట్టుకుంది. చెన్నై మహానగరంలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇవన్నీ దశాబ్దాలుగా డీఎంకే పార్టీకి కంచుకోటగా ఉంటున్నాయి. చెన్నై తోపాటు తిరువల్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాలో కూడా డీఎంకేకు మంచి పట్టు ఉంది.

ఈసారి డీఎంకే కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో వెళ్లిన ప్రతి సందర్భంలోనూ డీఎంకే పోటీ చేసే స్థానాలు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాలు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ పార్టీకి బలంగా నిలుస్తున్న ప్రాంతాలు కూడా ఈ జిల్లాలోని ఎక్కువగా ఉండడం అనేకసార్లు రుజువైంది. తాజాగా విజయ్ పార్టీ పెట్టడం విజయ్ స్వతహాగా క్రిస్టియన్ కావడం క్రిస్టియన్ మైనారిటీ ఓట్లన్నీ ఎక్కువగా విజయ్ వైపు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే డీఎంకే ఓటు బ్యాంకును భారీగా గండి కొట్టడం జరుగుతుందన్న టాక్ బలంగా ఉంది. దీంతో డీఎంకేకు వచ్చే సీట్లపై విజయ్ ఎఫెక్ట్ పడుతుందన్న మాట వినబడుతుంది. అలా అని అక్కడ విజయ్ గెలిచే అవకాశాలు కూడా తక్కువే ఓట్ల చీలిక ఎక్కువగా ఉంటే అది అన్న డీఎంకే పార్టీకి తెచ్చి అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది.

ఇక దక్షిణ తమిళనాడు, ఎడపాటి పలనీ స్వామి సొంత ప్రాంతమైన కొంగునాడు ప్రాంతంలో అన్న డీఎంకేకు మంచి పట్టు ఉంది. అక్కడ విజయ్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అన్నా డీఎంకే కు బలమైన బలమైన సామాజిక వర్గంగా ఉన్న దేవర్ సామాజిక వర్గం నుంచి కీలక నేతలు టీవీకె పార్టీలోకి వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ఓట్లు విజయ్ చీల్చే అవకాశం ఉంది.. ఇక్కడ ఏఐడిఎంకెకి నష్టం జరిగితే డీఎంకే కేకు లాభం చేకూరి అవకాశం ఉందన్న టాక్ ఉంది.!

ఇదిలావుంటే, కరూర్‌ ట్రాజెడీ ఇప్పటికీ కాగుతూనే ఉంది.. చివరి సినిమా ఆనుకున్న జననాయగన్ థియేటర్ల గేటు బైటే ఆగిపోయింది. త్రిషతో రిలేషన్ భార్యతో విడాకుల కేసుకు దారితీసింది. ఇక నామినేషన్ నుంచి ప్రచారానికి పర్మిషన్ వరకూ ప్రతిసారీ దెబ్బమీద దెబ్బ పడి దళపతిని ఆడుకుంటూనే ఉంది. రాజకీయాల్లో అనుభవం లేకపోవడం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని కొంతమంది చెబుతుంటే.. ఇలాంటి వివాదాలతో మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం జరుగుతోందంటున్నారు మరికొందరు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us