తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులకు కీలక సూచనలు చేసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికినవారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. వాహనంలో ఇతరులు ఉంటే వారికి, లేదంటే బంధుమిత్రులకు అప్పగించాలని, పోలీస్ స్టేషన్కు తరలించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఆదేశించింది.