ప్రకృతి అందించిన అద్భుత ఆహారాల్లో తేనె ఒకటి. రుచికి తియ్యగా ఉంటుందని, ఒంటికి మంచిదని అందరూ చెబుతుంటారు. కానీ ఎలా వాడాలి, ఎందులో కలపాలి అనేది సరిగ్గా ఎవ్వరికీ తెలియదు
TV9 Telugu
హనీకేక్.. ఇది గోధుమ పిండి, బెల్లం, పెరుగు, కొద్దిగా తేనె కలిపి సింపుల్‌గా కుక్కర్‌లో చేయవచ్చు. మృదువుగా ఊరించే కేక్ మీద కొద్దిగా తేనె పోసి తింటే చాలా రుచిగా ఉంటుంది
TV9 Telugu
హనీ మష్రూమ్ మంచూరియా... పుట్టగొడుగులను సాధారణ మంచూరియా పద్ధతిలోనే వండి.. ఆఖర్లో తేనె కలపొచ్చు. కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా అనిపించే ఈ వంటకం పంజాబ్, రాజస్థాన్‌లో ఫేమస్
TV9 Telugu
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా, ఎండు ఖర్జూరం ఏవైనా సరే పొడిలో కొద్దిగా తేనె కలిపి తింటే తక్షణ శక్తి ఇస్తుంది. బాగా అలసటగా అనిపించినప్పుడు ఇలా చేయొచ్చు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా
TV9 Telugu
రవ్వకేసరి, హల్వా... వంటివి చేసినప్పుడు చక్కెరతోపాటు కొంత తేనె వేయడం ద్వారా కమ్మగా ఉంటుంది. డబుల్‌కామీఠా.. టేస్టీ టేస్టీ స్వీట్. ఇందులో దాల్చినచెక్క, యాలకులు, డ్రైఫ్రూట్స్ వేస్తారు, ఆ మిశ్రమంలో తేనెనూ కలపొచ్చు
TV9 Telugu
గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగితే ఒత్తిడిని అధిగమించొచ్చు. నిద్రలేమి సమస్య ఉండదు. వేడి వాతావరణంలో పనిచేసేటప్పుడు తేనె తీసుకోకూడదు
TV9 Telugu
వేడి వేడి మసాలా పదార్థాల్లో వేయకూడదు. ఇలా చేస్తే హైడ్రాక్సీ మిథైల్ పెరిగి యాంటీ ఆక్సిడెంట్ స్థాయులు తగ్గుతాయి. బాగా కారంగానూ వేడిగానూ ఉన్న ఆహార పదార్థాల్లో తేనె కలిపితే అసమతుల్యం ఏర్పడుతుందని ఆయుర్వేదంలోనూ ఉంది
TV9 Telugu
ఆల్కహాల్, నూనెలోనూ దీన్ని కలపకూడదు. ఎప్పుడైనా పరిమితంగా తీసుకుంటే మంచిది. 18 నెలల్లోపు పిల్లలకు ఇవ్వకూడదు. మధుమేహులు వైద్యుల సలహా మేరకే వాడాలి