AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగులు మారే మంకీ బ్రష్ మొక్క.. పూలతోనే కీటకాలను ఆకర్షించే అరుదైన అద్భుతం!

Monkey brush vine plant: మంకీ బ్రష్ వైన్ అనే మొక్క జాతి.. దీని శాస్త్రీయ నామం కాంబ్రెటమ్ రొటుండి ఫోలియమ్. దక్షిణ అమెరికాకు చెందిన ఒక ఆకర్షణీయమైన సతత హరిత తీగ. ఉష్ణ మండలాల్లో ఈ తీగ మొక్క పుష్పిస్తోంది

రంగులు మారే మంకీ బ్రష్ మొక్క.. పూలతోనే కీటకాలను ఆకర్షించే అరుదైన అద్భుతం!
Monkey Brush
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 9:51 PM

Share

ప్రకృతిలో అనేక రకాల జీవజాతులు, మొక్కలు, చెట్లు ఉంటాయి.. వాటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత. ఔషధ మొక్కలు.. అద్భుతమైన ఫల, పుష్పాలు అందించే మరికొన్ని మొక్కలు ఉంటాయి. మరికొన్ని మొక్కలైతే అందంగా పూలు విరబూసుకొని తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. కీటకాలకు అవసరమైన మకరందాన్ని ఇచ్చి.. పరాగ సంపర్కానికి ఆకర్షిస్తాయి. వాటిలో ఒకటి మంకీ బ్రష్ వెయిన్ మొక్క. గుత్తులు గుత్తులుగా పూలను ఉత్పత్తి చేసి.. క్రమంగా రంగులు మార్చే గుణం దీని సొంతం. ఎక్కడో పుట్టిన ఈ మొక్క.. విశాఖలో వింతగా ఆకర్షిస్తోంది.

మంకీ బ్రష్ వైన్ అనే మొక్క జాతి.. దీని శాస్త్రీయ నామం కాంబ్రెటమ్ రొటుండి ఫోలియమ్. దక్షిణ అమెరికాకు చెందిన ఒక ఆకర్షణీయమైన సతత హరిత తీగ. ఉష్ణ మండలాల్లో ఈ తీగ మొక్క పుష్పిస్తోంది. వసంత వేసవికాలంలో.. ఈ మొక్క అందమైన పూలను పూయిస్తుంది. ఇది ఒక రకమైన అలంకార మొక్క అని అనొచ్చు. ఎందుకంటే పూసిన పూలు ఒత్తులు గుత్తులుగా ఉంటాయి. ఒకే చోట గుత్తులుగా పూసి బ్రష్ ను పోలి ఉంటుంది. నారింజ ఎరుపు రంగులో బ్రష్ లాంటి ఆకృతిలో ఈ మొక్క పూలను ఇస్తుంది. అందుకే దీన్ని మంకీ బ్రష్ వైన్ అని పేరు.

ఈ మొక్క.. పూలు చిన్నగా ఉండి పసుపు రంగు కేసరాలతో.. నారింజ ఎరుపు రంగులో కుచ్చులుగా. తోటల్లో అలంకరణలుగా.. కంచెలకు పాకేలా చేస్తారు. దీని పూలు పరిపక్వం చెందుతున్న కొద్ది సాధారణంగా పసుపు నుండి నారింజ రంగుకు.. చివరికి ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఈ పూలు కనిపిస్తాయి. ఈ పూలలో ఉండే మకరందం.. తేనెటీగలు, సీతాకోకచిలుకలు, పక్షులను ఆకర్షిస్తాయి.

ఎర్రటి ముత్యాలు పొదిగినట్టు ఉన్న ఈ మొక్క.. విశాఖలోని జీవవైవిద్య ఉద్యానవనంలో పూలను విరబూసింది. వందల రకాల ఫలా పుష్ప ఔషధ మొక్కలు చెట్లున్న.. బయోడైవర్సిటీ పార్కులో అరుదైన ఈ మొక్క పుష్పాలు చూపు తప్పుకోలేనంతగా తనవైపు ఆకర్షిస్తుంది. ‘మంకీ బ్రష్ వెయిన్ ను జీవవైవిద్య ఉద్యానవనంలో సంరక్షిస్తున్నాం. మొగ్గలు ఎర్రటి ముచ్చల్లా.. విరబూస్తుంటే నారింజ, ఎరుపు రంగుల్లో ముచ్చటగా కనిపిస్తాయి. సీతాకోకచిలుకలు, పక్షులను ఆకర్షిస్తూ ఉన్నాయి ఈ మొక్కలు.’ అని అన్నారు జీవవైవిద్య ఉద్యానవనం నిర్వాహకులు ప్రొఫెసర్ రామమూర్తి.

Follow Us