AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hygiene Hacks: మీ బూట్లు దుర్వాసన వస్తున్నాయా? ఉతికే పని లేకుండానే ఆ వాసనను తరిమికొట్టండిలా!

ఉఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని వారు ధరించే బూట్లను చూసి చెప్పవచ్చని అంటుంటారు. అయితే, వేసవి తాపం వల్ల పాదాలకు చెమట పట్టి, బూట్లు దుర్వాసన వస్తుంటే మాత్రం అది ఇతరుల ముందు మనల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. ఆఫీసులోనో లేదా ఫంక్షన్లలోనో బూట్లు విప్పాల్సి వచ్చినప్పుడు వచ్చే ఆ దుర్వాసన ఎదుటివారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

Hygiene Hacks: మీ బూట్లు దుర్వాసన వస్తున్నాయా? ఉతికే పని లేకుండానే ఆ వాసనను తరిమికొట్టండిలా!
How To Remove Shoe Odor Without Washing
Bhavani
|

Updated on: Apr 10, 2026 | 9:42 PM

Share

రోజూ ఉతకలేకపోయినా, కనీసం నెలకు ఒకసారి బూట్లను శుభ్రం చేయడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నుతాయి పరిశుభ్రంగా ఉంటాయి. పాదాల ఆరోగ్యం కోసం ఇతరుల ముందు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. రోజూ బూట్లను ఉతకడానికి సమయం లేని వారు, చిటికెలో ఆ వాసనను ఎలా పోగొట్టుకోవాలో.. బూట్లను తాజాగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

1. బేకింగ్ సోడా మ్యాజిక్: బేకింగ్ సోడాకు దుర్వాసనను పీల్చుకునే శక్తి ఉంటుంది. కొద్దిగా బేకింగ్ సోడాను పాత సాక్సులలో వేసి కట్టి, వాటిని రాత్రంతా మీ బూట్లలో ఉంచండి. ఉదయానికి దుర్వాసన పూర్తిగా తగ్గిపోతుంది.

2. వెనిగర్ స్ప్రే: వెనిగర్ బ్యాక్టీరియా మరియు ఫంగస్‌ను చంపడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. వెనిగర్‌ను నీటితో కలిపి, ఒక స్ప్రే బాటిల్ ద్వారా బూట్ల లోపల స్ప్రే చేయండి. ఆ తర్వాత కాసేపు ఎండలో ఉంచితే బూట్లు తాజాగా మారుతాయి.

3. రబ్బింగ్ ఆల్కహాల్: చిన్న దూది ఉండను రబ్బింగ్ ఆల్కహాల్‌లో నానబెట్టి, దానిని రాత్రంతా బూట్లలో ఉంచండి. ఆల్కహాల్ దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను సంహరించి, వాసన రాకుండా చేస్తుంది.

4. సాక్సుల విషయంలో జాగ్రత్తలు: బూట్ల లాగే సాక్సులు కూడా త్వరగా వాసన వస్తాయి. సాక్సులను ఉతికే ముందు సబ్బు నీటిలో నానబెట్టి, ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి. ఎండలో బాగా ఆరబెట్టడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది.

Follow Us