AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Records: 10 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్ జోడీ.. ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ భయ్యో..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ మరియు యశస్వి జైస్వాల్ విధ్వంసం సృష్టిస్తున్నారు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆడుతున్న ఈ భారతీయ యువ జోడీ, తాజాగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు పుస్తకాలను తిరగరాసింది. వీరిద్దరి ధాటికి దిగ్గజ ఓపెనర్ల రికార్డులు సైతం కనుమరుగయ్యాయి.

IPL Records: 10 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్ జోడీ.. ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ భయ్యో..!
Gt Vs Rr Vaibhav SooryavanshiImage Credit source: https://x.com/ani_digital/status/
Venkata Chari
|

Updated on: Apr 10, 2026 | 9:10 PM

Share

Rajasthan Royals Opening Partnership: గువాహటి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక పోరుకు ముందు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంచలన గణాంకాలతో వార్తల్లో నిలిచారు. కేవలం 248 బంతుల్లోనే 500 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారతీయ జోడీగా గుర్తింపు పొందారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వీరు ఆడిన ఇన్నింగ్స్ బౌలర్లకు పీడకలగా మారింది. కేవలం 11 ఓవర్ల మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ 14 బంతుల్లో 39 పరుగులు చేయగా, యశస్వి 32 బంతుల్లో 77 పరుగులతో విరుచుకుపడ్డారు.

సెహ్వాగ్ – గంభీర్ రికార్డులు బద్ధలు..

గతంలో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ 309 బంతుల్లో 500 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దశాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును వైభవ్ – యశస్వి జోడీ కేవలం 248 బంతుల్లోనే అధిగమించడం విశేషం. అయితే ఓవరాల్‌గా చూస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ అత్యంత వేగవంతమైన 500 పరుగుల రికార్డులో ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

బౌలర్లకు సింహస్వప్నంలా వైభవ్ – జైస్వాల్..

ఈ సీజన్‌లో రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ ఓపెనింగ్ జోడీ అర్ధ సెంచరీ భాగస్వామ్యాలను నమోదు చేయడం విశేషం. 15 ఏళ్ల అద్భుత ప్రతిభావంతుడు వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 218.72 స్ట్రైక్ రేట్‌తో 374 పరుగులు సాధించాడు. ఇందులో కేవలం 35 బంతుల్లోనే నమోదైన సెంచరీ కూడా ఉంది. మరోవైపు, యశస్వి జైస్వాల్ 69 మ్యాచ్‌ల్లో 2,356 పరుగులతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

అజేయంగా రాజస్థాన్ రాయల్స్..

ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్లుగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనసాగుతున్నాయి. నేడు జరగబోయే పోరులో ఏ జట్టుకు మొదటి ఓటమి ఎదురవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జైస్వాల్, వైభవ్ ల మెరుపు ఆరంభాలను బెంగళూరు బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఉన్న యశస్వి, సరికొత్త సెన్సేషన్ వైభవ్ కలిసి రాజస్థాన్‌ను మరోసారి విజయపథంలో నడిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం వారే!
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం వారే!
సెహ్వాగ్ బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించడానికి అసలు కారణం ఇదే
సెహ్వాగ్ బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించడానికి అసలు కారణం ఇదే
లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. సిరీస్ షెడ్యూల్ ఇదే
లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. సిరీస్ షెడ్యూల్ ఇదే
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!