AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొండి మోనార్క్.. గాయపడ్డ సింహం.. గొల్లుమంటున్న గల్ఫ్.. ఎండ్‌కార్డ్‌ పడేదెప్పుడు?

అమెరికా వేట కొనసాగుతుందా, ఇజ్రాయెల్ ఆట అదుపుతప్పుతుందా? గాయపడ్డ సింహం ఇరాన్ రెట్టించిన ఉత్సాహంతో తిరగబడుతుందా? లేక, మిడిలీస్ట్ టెన్షన్స్‌కి తెరపడుతుందా ముఖ్యంగా మనకు వంటగ్యాస్ తంటా తీరుతుందా? సీజ్‌ఫైర్ అనే రెండువారాల ఇంటర్వల్ తర్వాత ఏం జరుగుతుంది? ట్రంప్ మొదలుపెట్టిన జియోపొలిటికల్ గేమ్‌కు ఎప్పటికి ఎండ్‌ కార్డ్‌ పడుతుంది? అందరి కళ్లూ ఇస్లామాబాద్‌లో జరిగే పంచాయతీ మీదే. సంధి చర్చల సారాంశం ఏంటో ముందస్తుగా అంచనా వేద్దాం..!

మొండి మోనార్క్.. గాయపడ్డ సింహం.. గొల్లుమంటున్న గల్ఫ్.. ఎండ్‌కార్డ్‌ పడేదెప్పుడు?
Us Iran Peace Talks
Balaraju Goud
|

Updated on: Apr 10, 2026 | 9:49 PM

Share

నోబెల్ పీస్ ప్రైజ్‌ కోసం తెగ ఆరాటపడుతున్న అమెరికా ప్రెసిడెంట్‌ డోనాల్డ్ ట్రంప్‌నకు ఇది లక్కీ ఛాన్స్. ఇరాన్‌పై అకారణంగా యుద్ధం మొదలుపెట్టినందుకు లెంపలేసుకుని, సీజ్‌ఫైర్‌కి ఒప్పుకున్నందుకు ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు. పైగా, రెండు వారాల్లోగా ఆయనకు నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేస్తే మరో బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇజ్రాయెల్‌కి చెప్పి లెబనాన్‌పై దాడులు ఆపించే ప్రయత్నం చేస్తారు ట్రంప్ సారు. ఏ సోషల్ మీడియాలోనో వచ్చిన సెటైర్లు కావివి. ఈ మాటలన్నది స్వయానా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్. గతవారం తనపై ట్రంప్ చేసిన కామెంట్లకు ఇవి కౌంటర్లైతే కావొచ్చు గానీ, మాక్రాన్ మాటల్లో సీరియస్ మేటరైతే ఉంది. ఆయనడిగిందేదో ఆయనకిచ్చి ఆవిధంగా ప్రసన్నం చేసుకుంటేనే ప్రపంచశాంతి సాధ్యం. ఎందుకంటే, ఇస్లామాబాద్‌లో జరుగుతున్న సీజ్‌ఫైర్ చర్చల్లో ట్రంప్ వ్యవహారశైలే సెంట్రల్ పాయింట్. సీజ్‌ఫైర్ అనౌన్స్ చేసినరోజే… గల్ఫ్‌ దేశాలపైకి టెహ్రాన్ మిస్సైళ్లు దూసుకెళ్లాయి. సీజ్‌ఫైర్ అనౌన్స్ చేసినరోజే.. లెబనాన్‌పై భీకరదాడులతో విధ్వంసం సృష్టించింది ఇజ్రాయెల్. సీజ్‌ఫైర్ అనౌన్స్ చేసినరోజే.. ఇరాన్‌ సగం చచ్చింది.. పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యం అని మళ్లీ రెచ్చిపోయారు ట్రంప్. సీజ్‌ఫైర్ అనౌన్స్ చేసినరోజే.. బీరుట్‌లో పేలుళ్లు ఆగితేనే మిడిలీస్ట్‌లో శాంతిస్థాపన గురించి మాట్లాడదాం అని మెలిక పెట్టింది ఇరాన్. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); సో, ఇక్కడ పేరుకే సీజ్‌ఫైర్. కానీ, సైలెన్స్ ముచ్చటే లేదు. అంతటా అదే వయొలెన్స్. పోట్లాడుకోవడం ఆపండి.. ఇక మాట్లాడుకుందాం అని పాకిస్తాన్ అంపైరింగ్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి