AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshasapuram: తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ .. రాజ్ బి శెట్టి ‘రాక్షసపురం’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

సు ఫ్రమ్ సో సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు కన్నడ స్టార్ నటుడు రాజ్ బి శెట్టి. ఆ మధ్యన ఆయన నటించిన 45 సినిమా కూడా తెలుగులో బాగా ఆడింది. ఇప్పుడు రాక్షసపురం అంటూ మరో డిఫరెంట్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించనున్నాడు రాజ్ బి శెట్టి.

Rakshasapuram: తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ .. రాజ్ బి శెట్టి 'రాక్షసపురం' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Raj B Shetty Rakshasapuram Movie
Basha Shek
|

Updated on: Apr 10, 2026 | 9:50 PM

Share

రాజ్ బి శెట్టి హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ మూవీ రక్కసపురదోల్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు రాక్షసపురం టైటిల్ తో తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు. ఈ చిత్రాన్ని కె.ఎన్. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె. రవివర్మ నిర్మించారు. రవి సారంగ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు సమర్పణలో రాక్షసపురం సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై త్వరలో తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్ రామారావు హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను తెలిపారు. ‘ నా కెరీర్ డబ్బింగ్ చిత్రంతోనే ప్రారంభమైంది. కమల్ హాసన్ నటించిన ఎర్రగులాబీలు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాను. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు కొంత విరామం తర్వాత మళ్లీ మా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రాక్షసపురం అనే మూవీని తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నా. ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు రవి సారంగ అద్భుతంగా రూపొందించాడు. నా స్నేహితుడు రవివర్మ నిర్మించాడు. ఈ సినిమా చూశాక థ్రిల్ అయ్యాను. ప్రొడ్యూసర్ రవివర్మకు ఫోన్ చేసి నేను ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పాను. ఈ చిత్రంలో హీరో రాక్షస సంహారం చేస్తుంటాడు. అది ఒక ఊరిలో జరుగుతుంటుంది. అందుకే టైటిల్ రాక్షసపురం అని పెట్టారు.

‘నేను 86లో చిరంజీవి గారితో రాక్షసుడు అనే చిత్రాన్ని రూపొందించాను. ఆ సినిమా టైటిల్ కొందరికి నెగిటివ్ గా అనిపించింది. కానీ హీరో చేసేవన్నీ మంచి పనులే, కథ మంచిదే. హీరో విలన్స్ కు రాక్షసుడు కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఈ రాక్షసపురంలో కూడా హీరో రాక్షసుల్లాంటి విలన్స్ ను సంహరిస్తాడు. ఒక డిఫరెంట్ సినిమా కాబట్టి, ఇప్పుడు ఉన్న ట్రెండ్ కు నచ్చుతుంది. ఈ నెలాఖరులోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. రాక్షసంహారం మూవీని మీరంతా ఆదరించాలని కోరుతున్నా’ అని చెప్పుకొచ్చారు కే.ఎస్. రామారావు.

నటీనటులు – రాజ్ బి శెట్టి, స్వాతిష్ట, అర్చన కొట్టిగె, అనిరుధ్ భట్, బి. సురేఖ, గోపాలకృష్ణ దేశ్ పాండే, తదితరులు

ఇవి కూడా చదవండి

టెక్నికల్ టీమ్

ఎడిటర్ – కె.ఎం. ప్రకాష్ డీవోపీ – విలియమ్ డేవిడ్ మ్యూజిక్ – అర్జున్ జన్య నిర్మాత – కె రవివర్మ రచన, దర్శకత్వం – రవి సారంగ సమర్పణ – కె.ఎస్. రామారావు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us