Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. మరి అందులో మీ రాశి ఉందా.?
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సా హంగా, ఉల్లాసంగా ఉంటుంది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా కొత్త ప్రయత్నాలు చేపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అధి కారులు బాగా ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తారు. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకోకుండా ఆర్థిక భారం పడి, ఆర్థిక పరిస్థితి కొద్దిగా మారుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. చేపట్టిన పనుల్ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు సామా న్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు విం టారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుం డదు కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. కుటుంబ జీవితం ప్రశాంతతగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించి ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుం టారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా, సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనులకు ఎవరూ సహకరించనప్పటికీ, వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక లాభాలు బాగానే ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వ్యక్తిగత సమస్యల విషయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరి స్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. బంధువులతో వివాదాల నుంచి బయటపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికా రుల అభిమానాన్ని చూరగొంటారు. నిరుద్యోగులు తమకు లభించిన అవకాశాలను చేజార్చుకో కుండా చూసుకోవాలి. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. సమాజంలో కీర్తి ప్ర తిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు అందుతాయి. ఉద్యోగం మారడానికి అవ కాశముంది. ఆస్తి సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అనుకున్న సమయానికి పనులు కాక ఇబ్బంది పడతారు. గతంలో మీ సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల వల్ల కూడా లాభం పొందు తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ ఉన్నప్పటికీ, పని భారం ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
జీవిత భాగస్వామి నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయక సంబం ధాలు ఏర్పడతాయి. వస్తు, వాహన సౌకర్యాలు పొందుతారు. ఉద్యోగ జీవితంలో ప్రతిభా పాటవా లకు గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధికి అవకాశముంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
అనుకోకుండా ధనాదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
ధనుస్పు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం బాగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం చేతికి అందుతుంది. కొద్దిపాటి అనా రోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. మీ ఆలోచనలు ఫలించి ఈ రంగాల్లో మీ రాబడి బాగా పెరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఉద్యో గంలో అధికారులు ఆదరాభిమానాలు ప్రదర్శిస్తారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందు కుంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వ్యక్తిగత సమస్యల విషయంలో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు అమలు చేసి లాభాలు పొందుతారు. అన్ని వైపుల నుంచి మంచి జరిగే అవకాశ ముంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధి కారుల అండదండలు లభిస్తాయి. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యో గులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సుఖ సంతోషాలకు ప్రాధాన్య మిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సా హంగా, ఉల్లాసంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
దైవ కార్యాల మీద బాగా ఆసక్తి పెరుగుతుంది. వీటి మీద ఖర్చు ఎక్కువవుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపా రాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.



