Horoscope Today: ఆ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (మే 30, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. వృషభ రాశి వారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. మిథున రాశి వారికి పదోన్నతికి కూడా అవకాశముంది. అదనపు ఆదాయం, అదనపు రాబడి పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మే 30, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. వృషభ రాశి వారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. మిథున రాశి వారికి పదోన్నతికి కూడా అవకాశముంది. అదనపు ఆదాయం, అదనపు రాబడి పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. అనవసర సహాయాల వల్ల నష్టపోతారు. ఉద్యోగాల్లో ఒకటి రెండు ఆశయాలు, ఆకాం క్షలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపు తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. భరణి నక్షత్రం వారు ఆశించిన ఆఫర్ అందుకుంటారు. గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి జరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలకు సమయం బాగుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. రోహిణి నక్ష త్రం వారికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. ఆదిత్య హృదయం పారాయణ వల్ల విజయాలు సిద్ధి స్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి కూడా అవకాశముంది. అదనపు ఆదాయం, అదనపు రాబడి పెరుగుతాయి. కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చిన్నపాటి ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవు తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనులు, ప్రయత్నాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచ నలు ప్రవేశపెట్టి లాభం పొందుతారు. ఉద్యోగంలో అధికార బాధ్యతలను పంచుకోవడం జరుగు తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. వ్యక్తి గత సమస్య పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆశ్లేష నక్షత్రం వారు అనుకున్నది సాధిస్తారు. విష్ణు సహస్ర నామం చదువుకోవడం వల్ల ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. అధికా రులకు నమ్మకస్తులవుతారు. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. పుబ్బా నక్షత్రంవారికి మనసులోని కోరిక ఒకటి నెరువేరుతుంది. సుందరాకాండ పారాయణ వల్ల సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి జీవితం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారుల లాభాలకు లోటుండదు. ఉత్తరా నక్షత్రం వారికి ధన యోగం పడుతుంది. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల సర్వతా విజయాలు సిద్ధిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. అధికార బాధ్యతలు పంచుకుం టారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొం టారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. స్వాతి నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మనసులోని కోరిక నెరవేరుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితంలో మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మిత్రుల సహాయంతో పనులు పూర్తవుతాయి. అనూరాధ నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడ తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరు స్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వారు శుభవార్త వింటారు. దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదనిపిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయ త్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. సుందరాకాండ పారాయణ వల్ల ఆశించిన మేలు జరుగుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఒకటి రెండు సమస్యలున్నా వాటిని అధిగమి స్తారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగు తాయి. వృత్తుల్లో ఉన్నవారికి అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. ఎవరికీ మాట ఇవ్వక పోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. పూర్వాభాద్ర వారికి మనసులోని కోరిక నెరవేరుతుంది. దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. పనిభారం బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడతారు. వ్యాపారం లాభసాటిగా సాగిపోతుంది. కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయ త్నాలు సఫలం అవుతాయి. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కలిసి వస్తుంది. లలితా సహస్ర నామం చదువుకోవడం చాలా మంచిది.