చక్రం తిప్పబోతున్న కుజ గ్రహం.. ఆ రాశుల వారికి అరుదైన అధికార, ఐశ్వర్య యోగాలు..!
జూన్ 2వ తేదీ నుంచి జూలై 12 వరకు తన స్వస్థానమైన మేష రాశిలో సంచారం చేయబోతున్న కుజ గ్రహం ఆరు రాశుల వారి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయబోతోంది. ఇందులో నాలుగు రాశుల వారికి ఈ కుజ సంచారంతో రుచక మహా పురుష యోగం ఏర్పడుతుండగా, రెండు రాశుల వారికి అపార ధన లాభం కలిగే అవకాశం ఉంది.
జూన్ 2వ తేదీ నుంచి జూలై 12 వరకు తన స్వస్థానమైన మేష రాశిలో సంచారం చేయబోతున్న కుజ గ్రహం ఆరు రాశుల వారి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేయబోతోంది. ఇందులో నాలుగు రాశుల వారికి ఈ కుజ సంచారంతో రుచక మహా పురుష యోగం ఏర్పడుతుండగా, రెండు రాశుల వారికి అపార ధన లాభం కలిగే అవకాశం ఉంది. రుచక మహా పురుష యోగం వల్ల అధికార యోగంతో కూడిన ఐశ్వర్య యోగం పడుతుంది. ఇందులో మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి రుచక మహా పురుష యోగం పడుతుండగా, మిథునం, మీన రాశుల వారికి మహా భాగ్య యోగం పట్టబోతోంది. ఏ రాశికైనా కేంద్ర స్థానాల్లో, స్వస్థాన, ఉచ్ఛ క్షేత్రాల్లో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు రుచక మహా పురుష యోగం ఏర్పడుతుంది.
- మేషం: రాశ్యధిపతి కుజుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి రుచక మహా పురుష యోగం ఏర్పడింది. దీని ఫలితంగా సర్వత్రా ఈ రాశివారి ప్రాభవం, వైభవం పెరుగుతాయి. ఉద్యో గంలో కీలక పదవులు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రముఖులుగా చెలామణీ కావడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది.
- మిథునం: ఈ రాశివారికి లాభ స్థానంలో లాభాధిపతి కుజుడి సంచారం వల్ల కలలో కూడా ఊహించని పురో గతి సాధ్యపడుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు అపారమైన ధన లాభం కలుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. స్థిరాస్తులు విస్తరిస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కార మవు తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. అనేక మార్గాల్లో సంపద వృద్ది చెందుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి దశమ కేంద్రంలో కుజ సంచారం వల్ల రుచక మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అంది వస్తాయి. విదేశాల్లో స్థిరత్వం పొందే సూచనలు కూడా ఉన్నాయి. లాభ దాయక మైన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా బాగా విస్తరిస్తాయి. మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి.
- తుల: ఈ రాశికి సప్తమ కేంద్రంలో కుజ సంచారం వల్ల రుచక మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల ఆకస్మిక ధన లాభంతో పాటు ఆస్తిపాస్తులు సంక్రమించడం వల్ల సిరిసంపదలు వృద్ధి చెందు తాయి. జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆర్థికంగా జీవి తాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి బాగా కష్టపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభ వం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. గృహ, వాహన యోగాలు పడతాయి.
- మకరం: ఈ రాశివారికి చతుర్థ కేంద్రంలో కుజ స్వస్థాన సంచారం వల్ల రుచక మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల వీరి ఆశలు, ఆశయాలు చాలావరకు నెరవేరుతాయి. సొంత ఇంటి కల ఫలిస్తుంది. స్థిరాస్తులు సమకూరుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో వైభవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశముంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ది ఉంటుంది.
- మీనం: ఈ రాశివారికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన కుజుడు ధన స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ధన సంపాదన క్రమంగా పెరుగుతుంది. సునాయాసంగా, అప్రయత్నంగా ధన లాభం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఊహించని విధంగా జీతభత్యాలు, అదనపు రాబడి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంచెలంచెలుగా ఎదిగిపోతాయి. మాటకు, చేతకు విలువ పెరు గుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విలువ బాగా పెరిగే అవకాశం ఉంది.