Horoscope Today(24 June): స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు..

Rashi Phalalu (24 June 2023): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరగబోతోందో.. ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇవాళ ఆయా రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? 12 రాశుల వారి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today(24 June): స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు..
Horoscope 24th June 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 24, 2023 | 6:26 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రోజంతా హ్యాపీగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఎక్కువగా స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వినోద యాత్ర చేసే అవకాశం కూడా ఉంది. ఆరో గ్యానికి డోకా ఉండదు. వృత్తి, ఉద్యోగాలు కూడా లాభదాయకంగా సాగిపోతాయి. ఒకరిద్దరు బంధువులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగు తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి విలువైన కానుకలు ఇస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులను వీలైనంతగా సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేసే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాల వారికి శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ఫలితం ఉంటుంది. కొందరు బంధువులతో గతంలో తలెత్తిన విభేదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఎక్కువగా మిత్రబృందంతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తవారు పరిచయం అయ్యే అవకాశం ఉంది. విహారయాత్ర చేసే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల విషయంలో నిలకడగా ముందుకు సాగుతాయి. డాక్టర్లకు ఇతర వృత్తి నిపుణులకు తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. కుటుంబంలో సామరస్య వాతావ రణం నెలకొంటుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రోజులో ఎక్కువ సమయం ప్రేమ వ్యవహారాలకు కేటాయించడం జరుగుతుంది. భారీగా కానుకలు కొనిచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజ నకంగా ఉంటుంది. డబ్బు ఇవ్వవలసిన వారు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించినంతగా పురోగతి కనిపిస్తుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తవు తాయి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రోజులో ఎక్కువ భాగం కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడం జరుగుతుంది. విహారయాత్ర చేసే అవకాశం ఉంది. దైవ కార్యాలకు ఆల యాలు సందర్శనకు సమయం కేటాయించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడు తుంది. కొందరు బంధుమిత్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. ప్రముఖులైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): బంధుమిత్రులతో ఒక శుభకార్యంలో పాల్గొనడం జరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేసే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిలకడగా కొనసాగుతాయి. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఆర్థిక సంబంధమైన అవసరాలు తీరుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపో తుంది. ఇష్టమైన వారితో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల మీద భారీగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసు కునే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ఉన్న వారికి తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఎక్కువగా కుటుంబ సభ్యులతో లేదా బంధువు లతో కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఈ వారాంతపు రోజు మొత్తం మీద ప్రశాంతంగా, ఆనందంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నం ఒకటి సఫలం అవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశి వారికి రోజంతా సరదాగా, సాఫీగా సాగిపోతుంది. ఎక్కువ సమయం చిన్ననాటి స్నేహితులకు గడపటానికి సరిపోతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, అనుకోకుండా ఒక శుభవార్త వినడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. కుటుంబ పరంగా ఆశించినంతగా ప్రశాంతత లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రోజులో ఎక్కువ సమయం ఇంటి పట్టునే కుటుంబంతో కాలక్షేపం చేయడం జరుగుతుంది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. అనుకోకుండా ఆదాయం పెరగటం, రాదనుకున్న డబ్బు చేతికి అందటం లేదా మొండి బాకీ ఒకటి వసూలు కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా ముందుకు సాగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ వారాంతంలో ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే సరదాగా గడిపే అవకాశం ఉంది. దైవకార్యాలకు, ఆలయాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి దానంతటదే పరిష్కారం కావచ్చు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఆలయాల సందర్శనకు, సేవా కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం కూడా ఉంది. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. ఒకటి రెండు ఆర్థిక వ్యవ హారాలు సానుకూల పడతాయి. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. పిల్లలు పురోగతి చెందుతారు. డాక్టర్లు, లాయర్లకు గుర్తింపు ఏర్పడుతుంది. సొంత ఊరికి వెళ్లే అవకాశం కూడా ఉంది. తోబుట్టువులు ఇంటికి రావడం జరుగుతుంది.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..