Horoscope Today: ఆ రాశి వారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఇలా..
దిన ఫలాలు (మార్చి 21, 2024): మేషం రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృషభం రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మిథునం రాశివారి ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మార్చి 21, 2024): మేషం రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృషభం రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మిథునం రాశివారి ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారాల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆధ్యాత్మిక చింతన పెరిగి సత్సంగాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయ త్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. పిల్లల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. సోదరులతో సఖ్యత పెరుగు తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి మంచి కబుర్లు వింటారు. వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా కొత్త ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగి పోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతా వరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి, పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వాతావ రణం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శి స్తారు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం అందుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. బంధువుల జోక్యాన్ని తగ్గించడం మంచిది. స్నేహితులను కలుపుకుని కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణాలు చాలావరకు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యో గాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగు లకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. వ్యక్తి గత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఇంటా బయటా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిపాటి ఉప శమనం లభిస్తుంది. ఎంతో శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసి లాభాలు పొందుతారు. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. అనవసర ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు సకా లంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
చేపట్టిన పనులు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.