Horoscope Today: ఆ రాశి వారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 22, 2024): మేష రాశి వారికి శుక్రవారంనాడు ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా బాధ్యతలు పెరిగి మానసిక ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
Horoscope Today 21st March 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 22, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 22, 2024): మేష రాశి వారికి శుక్రవారంనాడు ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా బాధ్యతలు పెరిగి మానసిక ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఊహించని విధంగా ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. వ్యాపారాలు బలం పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. గృహం కొనుగోలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగి మానసిక ఒత్తిడి ఉంటుంది. దాదాపు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

స్థిరాస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలో నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగులు అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రయాణాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. ఎవరికీ హామీలు కూడా ఉండవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇష్టమైన స్నేహితుల్ని కలుసుకుంటారు. కొందరు బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభి స్తుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు అందుకుంటారు. మీ జీవితంలో ఒక శుభ పరి ణామం చోటు చేసుకునే అవకాశముంది. కొత్త ఉద్యోగం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సక్రమంగా బాధ్యతలు నిర్వహించి, ప్రోత్సాహకాలు అందుకుంటారు. మీరు చేపట్టిన పనులు తేలికగా పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదం కొద్దిగా ముదురే అవకాశముంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. రాదనుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చ వద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంట్లో దైవ కార్యాలు నిర్వహిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలను కూడా తీర్చగలుగుతారు. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వీటివల్ల భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేపడతారు. ఇంటా బయటా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగతంగా కొన్ని కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. రోజంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. పిల్లల భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. సర్వత్రా మీ సలహాలు, సూచనలు చెల్లుబాటు అవు తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు ఫలి స్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఆలయాలను సంద ర్శిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి.చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే వృథా ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త. ఎంత కష్టపడ్డా ఆశించిన ప్రతిఫలం ఉండకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. అధికారులతో కానీ, స్నేహితులతో కానీ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అదనపు పనిభారం మీద పడుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సమాజంలో మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సానుకూ లంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగా చక్కబడతాయి. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరి స్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలను విస్త రించే ప్రయత్నం చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.