Love Astrology: మీన రాశిలోకి శుక్రుడు.. ప్రేమ వ్యవహారాల్లో ఆ రాశుల వారికి రాజయోగాలు!
ఈ నెలాఖరుతో తన ఉచ్ఛ రాశి అయిన మీనంలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు ఇప్పటి నుంచే కొన్ని రాశుల మీద తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని కనబరచబోతున్నాడు. ప్రేమలకు, శృంగారానికి, లైంగిక కార్యకలాపాలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడి వల్ల..
ఈ నెలాఖరుతో తన ఉచ్ఛ రాశి అయిన మీనంలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు ఇప్పటి నుంచే కొన్ని రాశుల మీద తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని కనబరచబోతున్నాడు. ప్రేమలకు, శృంగారానికి, లైంగిక కార్యకలాపాలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడి వల్ల మేషం, వృషభం, కన్య, తుల, మకరం, కుంభ రాశులవారు ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కబోతున్నారు. వీరి ప్రేమ వ్యవహారాలు నల్లేరు కాయల మీద బండిలా ముందుకు సాఫీగా, హ్యాపీగా దూసుకు పోతాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పనిసరి అవుతుంది.
- మేషం: ప్రేమ వ్యవహారాల్లో ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. ప్రేమ భాగస్వామి పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తారు. మంచి పర్యాటక ప్రదేశాలను లేదా సుందర ప్రదేశాలను ఎంపిక చేసుకుని ప్రేమ భాగస్వామితో కలిసి వెళ్లి రావడం జరుగుతుంది. ప్రేమ భాగస్వామికి, ముఖ్యంగా ప్రేయసికి విలు వైన కానుకలు కొనివ్వడం జరుగుతుంది. సరైనా ప్రేమ భాగస్వామిని ఎంచుకోవడంలో సమయం పట్టినప్పటికీ, సఖ్యత, సాన్నిహిత్యం సంపాదించడంలో మాత్రం వేగంగా చర్యలు తీసుకుంటారు.
- వృషభం: ఒకపట్టాన ప్రేమ వ్యవహారాల్లో పడని ఈ రాశివారు గత కొద్ది కాలంగా ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రేమాభిమానాలను చూరగొనడానికి వీరికి బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ప్రేమను చూరగొన్న తర్వాత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, తల్లితండ్రుల అనుమతి తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రేమ భాగస్వామికి కానుకలు బహూకరించడంలో వీరిని మించినవారు ఉండకపోవచ్చు. భాగస్వామితో ఎంతో సున్నితంగా, సాదరంగా వ్యవహరించడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశివారు తనకంటే ఉన్నత స్థాయి వ్యక్తితో ప్రేమలో పడే అవకాశముంటుంది. ప్రేమ వ్యవహా రాల్లో సాధ్యమైనంత నిజాయతీతో వ్యవహరించడానికే వీరు ప్రాధాన్యమిస్తారు కానీ, మధ్య మధ్య హద్దుల్ని దాటడం కూడా జరుగుతుంది. భావోద్వేగాలు పెరుగుతుంటాయి. అతి తక్కువ కాలంలో బాగా సాన్నిహిత్యం పెంచుకోగలుగుతారు. రెండు వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా కుంభ రాశి శుక్రుడి కారణంగా ప్రేమాయణం కొనసాగుతూనే ఉంటుంది.
- తుల: మొదటి చూపులోనే ప్రేమలో పడే అవకాశం ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది. మొదట్లో సాదా సీదాగానే ప్రేమ వ్యవహారాలు మొదలైనప్పటికీ, కాలం గడిచే కొద్దీ శృంగారానికి ప్రాధాన్యం ఇవ్వ డం ప్రారంభం అవుతుంది. విలువైన కానుకలు సమర్పించడం, పెళ్లికి ముందే హనీమూన్ కు వెళ్లడం, భారీగా ఖర్చు చేయడం వంటివి జరిగిపోతాయి. తెగువ, చొరవ పెరుగుతాయి. ఎప్పటి కప్పుడు కొత్త పద్ధతులు కనిపెట్టడంలో, ప్రేమలను కొత్త పుంతలు తొక్కించడంలో ముందుంటారు.
- మకరం: ప్రేమలో పడిన దగ్గర నుంచి రకరకాల ప్రయత్నాలతో ప్రేమ భాగస్వామికి దగ్గర కావడం జరుగుతుంది. ప్రతి దానికీ ఒక పద్ధతి ఉంటుందనే అభిప్రాయంతో మొదటి నుంచి ఆచితూచి అడుగు వేయడం వీరి ప్రత్యేకత. అతి తక్కువ కాలంలో ప్రేమ భాగస్వామిలో తన పట్ట నమ్మకాన్ని పెంచడం, తాను ఎంత కేర్ తీసుకునేది చేతల ద్వారా తెలియజేయడం వంటివి జరుగుతాయి. ప్రేమ భాగస్వామికి కానుకలు ఎంపిక చేయడంలో వీరిని మించినవారుండరు.
- కుంభం: ఈ రాశి శనీశ్వరుడి రాశి అయినందువల్ల ప్రేమ వ్యవహారాల్లో వీరి తీరు కొద్దిగా మందకొడిగానే ఉంటుంది కానీ, ఒకసారి ప్రేమలో పడిన తర్వాత వీరిని మార్చడం, దారి మళ్లించడం ఎవరి తరమూ కాదు. ప్రేమ భాగస్వామితో నిజాయతీతో, చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. శృంగార కార్య కలాపాల కంటే పెళ్లికే ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమల్లోనూ కఠిన క్రమశిక్షణను ప్రవేశపెడతారు. వీరు భాగస్వామిని ఎంపిక చేసుకున్న తర్వాత ఎక్కువగా ఆలయాలకు తీసుకు వెళ్లడం జరుగు తుంది.