శత్రు క్షేత్రమైన కుంభరాశిలో కుజుడు సంచారం.. వారి దాంపత్య జీవితంతో కష్టనష్టాలు జాగ్రత్త..!

ప్రస్తుతం కుజుడు తనకు శత్రు క్షేత్రమైన కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు. పైగా ఇక్కడ తనకు ప్రబల శత్రువైన శనీశ్వరుడితో కలిసి ఉంటున్నాడు. కుజుడు కోపతాపాలకు, తొందరపాటు నిర్ణయాలకు, తొందరపాటు చర్యలకు, అసహనానికి, వాగ్వాదాలకు, అనవసర ఖర్చులకు, వ్యసనాలకు కారకుడు.కుజ దోష సంబంధమైన దోషాల నుంచి విముక్తి లభించాలంటే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, సుందరకాండ పారాయణం చేసుకోవడం చాలా మంచిది.

శత్రు క్షేత్రమైన కుంభరాశిలో కుజుడు సంచారం.. వారి దాంపత్య జీవితంతో కష్టనష్టాలు జాగ్రత్త..!
Kuja Gochar
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 21, 2024 | 7:19 PM

ప్రస్తుతం కుజుడు తనకు శత్రు క్షేత్రమైన కుంభ రాశిలో సంచారం చేస్తున్నాడు. పైగా ఇక్కడ తనకు ప్రబల శత్రువైన శనీశ్వరుడితో కలిసి ఉంటున్నాడు. కుజుడు కోపతాపాలకు, తొందరపాటు నిర్ణయాలకు, తొందరపాటు చర్యలకు, అసహనానికి, వాగ్వాదాలకు, అనవసర ఖర్చులకు, వ్యసనాలకు కారకుడు. అందువల్ల కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులను కుటుంబ వ్యవహారాలు, దాంపత్య జీవితంతో కష్టనష్టాల పాలు చేయడానికి అవకాశం ఉంది. ఈ రాశుల వారికి కుజ దోష ఫలితాలు కొద్దిగానైనా తప్పకపోవచ్చు. కుజ దోష సంబంధమైన దోషాల నుంచి విముక్తి లభించాలంటే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, సుందరకాండ పారాయణం చేసుకోవడం చాలా మంచిది.

  1. కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల కొన్ని దోషాలు ఏర్పడ్డాయి. పైగా ఇక్కడ శనితో కలవడం వల్ల ఈ దోషం రెట్టింపయింది. దీని ఫలితంగా కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలపై అసంతృప్తి ఏర్పడుతుంది. వాదోపవాదాలకు అవకాశం ఉంటుంది. తొందరపాటుతనంతో వ్యవహ రించడం జరుగుతుంది. వ్యసనాల మీద ఖర్చయ్యే అవకాశం కూడా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందక రుణాలు చేయవలసి రావచ్చు. మిత్రుల వల్ల డబ్బు నష్టమయ్యే సూచనలున్నాయి.
  2. సింహం: సప్తమ రాశిలో కుజుడి సంచారం వల్ల కుటుంబంలో మధ్య మధ్య కోపతాపాలు హద్దులు దాటు తుంటాయి. దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి స్వల్ప అనారోగ్యాలకు గురయ్యే అవకాశముంది. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పొరపాట్లు చేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి జరిగే అవకాశముంది. వ్యాపా రాల్లో భాగస్వాములతో లేదా పోటీదార్లతో సమస్యలు తలెత్తుతాయి. అకారణ వైరాలు ఏర్పడతాయి.
  3. వృశ్చికం: ఈ రాశికి కుజుడు అధిపతి అయినప్పటికీ, నాలుగవ స్థానంలో ఉండడం, పైగా శనితో కలవడం వల్ల ఆరోగ్యం విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు మందగిస్తాయి. కుటుం బంలో కోపతాపాలు పేట్రేగిపోతుంటాయి. విభేదాలకు, అపార్థాలకు, అసహనాలకు అవకాశ ముంది. బంధుమిత్రులతో కూడా సమస్యలు తలెత్తుతాయి. దాంపత్య సుఖం బాగా తగ్గుతుంది.
  4. మకరం: ఈ రాశికి కుటుంబ స్థానంలోనే కుజుడు సంచారం చేస్తున్నందువల్ల కుటుంబ సౌఖ్యం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాట పట్టింపులుండే సూచనలున్నాయి. మాట తొందర పాటు మాటల వల్ల నష్టపోతారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు మిగలడం తక్కువగా ఉంటుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. స్వల్ప అనారోగ్యాలు బాధపెడతాయి.
  5. కుంభం: ఈ రాశిలో కుజ సంచారం వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయిపోతూ ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉంటుంది. ఫలితం బాగా తక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి అవమానాలు ఎదురవుతాయి. స్వల్ప అనారోగ్యాలు బాధి స్తాయి. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితంలో అశాంతి పెరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల ఆర్థిక నష్టం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో వాగ్వాదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో డబ్బు నష్టపోవడం, విలువైన వస్తువులు కోల్పోవడం వంటివి జరుగుతాయి.