Horoscope Today: ఆ రాశుల వారు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.. శనివారం రాశిఫలాలు

Today Horoscope: ముందు, వెనుక ఆలోచించకుండా మనం తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు

Horoscope Today: ఆ రాశుల వారు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.. శనివారం రాశిఫలాలు
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 13, 2021 | 9:17 AM

Today Horoscope: ముందు, వెనుక ఆలోచించకుండా మనం తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. ఈ రోజు (నవంబర్ 13న) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రాశివారికి సమస్యలు ఎదురైనప్పటికీ.. ధైర్యంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాల్లో బంధుమిత్రుల సలహాలు మేలు.

వృషభం: ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉండి సమస్యలను ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిథునం: ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంతో ముందడుగు వేయాలి. గొడవలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

కర్కాటకం: చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ.. ఫలితాలు వచ్చే అవకాశముంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు.

సింహం: ఈ రోజు శుభ ఫలితాలను అందుకుంటారు. కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరే అవకాశముంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కన్య: ఉద్యోగులకు, పలు రంగాల వారికి శుభకాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, విందు వినోదాల్లో పాల్గొంటారు.

తుల: ఈ రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. పనులకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గొడవలకు దూరంగా ఉండాలి.

వృశ్చికం: ఆశించిన ఫలితాలను అందుకోవడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. తోటివారితో గొడవలకు దిగకుండా.. కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చడం ప్రమాదకరం.

ధనస్సు: ఈ రాశి వారికి శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి.. పనులను పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

మకరం: ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. ధైర్యంతో పూర్తిచేస్తారు. మనశ్శాంతి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక వ్యవహరాలపై చర్చ చేస్తారు.

కుంభం: ఈ రాశి వారికి ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమించి పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక శుభవార్త అందుకుంటారు.

మీనం: ఈ రోజు ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. తోటివారి సహకారం తీసుకుంటారు. అవసరానికి తగిన ఆర్థిక సహాయం అందుతుంది.

Also Read:

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. మళ్లీ ఎంత పెరిగిందంటే?