Horoscope Today: ఈ రాశుల వారు ఖర్చులు చేస్తారు.. అనారోగ్య సమస్యలు ఉంటాయి.. ఈరోజు రాశి ఫలాలు..
రాశి ఫలాలు గురించి ఈరోజు తమ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ముందుగానే తెలుసుకోవాలని అనుకుంటారు.
రాశి ఫలాలు గురించి ఈరోజు తమ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ముందుగానే తెలుసుకోవాలని అనుకుంటారు. ఈరోజు ఆదివారం చంద్రుడు కుంభ రాశికి దూరంగా మీన రాశిలో ఉంటాయి. దీంతో పలు రాశులలో కొన్ని ప్రతికూల వాతావరణం ఉంటుంది. అదెంటో తెలుసుకుందామా.
మేష రాశి.. ఈరోజు వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తివివాదాలను పరిష్కరించుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి.
వృషభ రాశి.. ఈరోజు వీరు నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. అప్పు సమస్యలు తగ్గిపోతాయి. వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మిథున రాశి.. ఈరోజు వీరు గొడవలు దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి.. ఈరోజు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. పిల్లల పట్ల జాగ్రత్త మంచిది. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
సింహ రాశి.. ఈరోజు వీరు బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువ చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కన్య రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తి వివాదంలో ఆటంకాలు ఉండవు. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి.. ఈరోజు వీరు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. చేపట్టిన పనులు ముగించలేరు.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.
ధనస్సు రాశి.. వీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుటుంటారు. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అనుకోని శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మకర రాశి.. ఈరోజు వీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు మరింత పెరుగుతాయి. మానసికంగా ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులను మధ్యలోనే ఆపివేస్తారు. ఖర్చులు పెరుగుతాయి.
కుంభ రాశి.. ఈరోజు వీరు ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల మాటలను నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు పూర్తి కావు. ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి.
మీన రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. శత్రువులు పెరుగుతారు. శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. ఖర్చులు చేస్తారు.
Also Read: Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్ బాయ్స్… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!