Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 12, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. వృషభ రాశి వారు వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గే అవకాశముంది. మిథున రాశి వారు వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 12th November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 12, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 12, 2024): మేష రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. వృషభ రాశి వారు వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. మిథున రాశి వారు వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. కొద్దిగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ప్రయాణాలు లాభిస్తాయి. విలాసాలు, స్నేహితుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగు తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఇంటా బయటా అనేక బాధ్యతలను నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా తీరిక ఉండకపోవచ్చు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. అత్యవసర పనులు, వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కొద్దిపాటి అపార్థాలు తలెత్తుతాయి. మంచి స్నేహాలు కలుగుతాయి.. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవడం మంచిది. కొద్దిగా పని భారం కూడా పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండకపోవచ్చు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు బంధుమిత్రుల సహాయ సహకారా లతో పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం సవ్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. తల్లితండ్రుల నుంచి శుభవార్తలు వింటారు. తోబుట్టువులతో ఆస్తి, ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయ ప్రయత్నాల్లో విజయాలు లభిస్తాయి. సంపాదన మీద శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా ఫలితముంటుంది. కుటుంబంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని ముఖ్య మైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం కలుగుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యో గులతో పాటు ఉద్యోగులకు కూడా కొన్ని సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరియాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అనుకోని ఖర్చుల కారణంగా ఆదాయ ప్రణాళికలు తారుమారవుతాయి. కొన్ని వ్యవహారాలు, పనుల మీద వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో బరువు బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం, అవివాహితులకు వివాహ యోగం పడతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో మీరు తలపెట్టిన మార్పులు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. స్థిరాస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. పిల్లల చదువుల విష యంలో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయ వృద్ధికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం అవుతారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్లు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. లాభాలకు లోటుండక పోవచ్చు కానీ, కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి జీవితం సామాన్యంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరుగుతుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల మెప్పు పొందుతారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టం కలుగుతుంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే