Lord Shani: శని వక్ర త్యాగంతో వారికి డబ్బు విషయంలో కష్టనష్టాలు.. పరిహారాలు ఇవీ..!

ఈ నెల(నవంబర్) 15 నాటితో శని వక్ర త్యాగం జరుగుతోంది. గత కొన్ని మాసాలుగా శని కుంభరాశిలో వక్రించి ఉండడం వల్ల ఏలిన్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు కొద్దిగా తగ్గడం జరిగింది. దీంతో కొన్ని రాశుల వారు గత ఆరు నెలలుగా ప్రశాంతంగా బతకడం జరుగుతోంది. తన స్వక్షేత్రమైన కుంభరాశిలో శని వక్రగతి నుంచి బయటపడి రుజు మార్గంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశుల వారికి మళ్లీ శని దోషాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Lord Shani: శని వక్ర త్యాగంతో వారికి డబ్బు విషయంలో కష్టనష్టాలు.. పరిహారాలు ఇవీ..!
Money Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 11, 2024 | 6:27 PM

ఈ నెల 15తో శని వక్ర త్యాగం జరుగుతోంది. శని వక్రించి ఉండడం వల్ల ఏలిన్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు కొద్దిగా తగ్గడం జరిగింది. కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారు గత ఆరు నెలలుగా ప్రశాంతంగా బతకడం జరుగుతోంది. తన స్వక్షేత్రమైన కుంభరాశిలో శని వక్రగతి నుంచి బయటపడి రుజు మార్గంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశుల వారికి మళ్లీ శని దోషాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రాశుల వారు తరచూ శివార్చన చేయించడం వల్ల శని దోషం చాలావరకు తగ్గడం జరుగుతుంది. మధ్య మధ్య నల్లరంగు దుస్తులు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా శని దోషం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు చేపట్టేటప్పుడు ఈ రంగులుకలిసి ఉన్న దుస్తులు ధరించడం మంచిది.

  1. కర్కాటకం: ఈ రాశికి అష్టమ శని దోషం కొనసాగుతుంది. దీనివల్ల ఉద్యోగంలో పని భారం బాగా పెరుగు తుంది. రావలసిన సొమ్ము రాకుండా నిలిచిపోతుంది. ఏ పనీ ఒక పట్టాన పూర్తికాక ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలకు ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందలేకపోవచ్చు. అయితే, శని తన స్వక్షేత్రంలో ఉన్నందువల్ల ఈ సమస్యలేవీ మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు.
  2. సింహం: ఈ రాశికి సప్తమంలో శని సంచారం వల్ల ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఏ వ్యవహారమూ వ్యయ ప్రయాసలతో గానీ పూర్తి కాకపోవచ్చు. డబ్బు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం, రావలసిన సొమ్ము రాకపోవడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, లాభం తక్కువగా ఉంటుంది. అయితే, సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న శని వల్ల శశ మహా పురుష యోగం ఏర్పడడం వల్ల ధన, అధికార యోగాలు కూడా పట్టడం జరుగుతుంది.
  3. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల మనశ్శాంతి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శుభ కార్యాలు, పదోన్నతులు నిలిచిపోతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. స్వగృహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలకు కూడా అవకాశం ఉంది. అయితే, శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఈ రాశికి కూడా శశ మహా పురుష యోగం కలిగినందువల్ల ఈ దోషాలన్నీ తాత్కాలికమే అవుతాయి.
  4. మకరం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంటుంది. శ్రమ ఎక్కువ లాభం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలలో అవరోధాలు ఏర్పడతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి చిక్కుల్లో పడడం జరుగుతుంది. అయితే, శనీశ్వరుడికి ఇది స్వస్థానం అయినందువల్ల, రాశ్యధిపతి కూడా శనే అయినందువల్ల ఈ రాశివారికి ఇక ఏలిన్నాటి శని దోషం ఎక్కువగా ఉండే అవకాశం లేదు.
  5. కుంభం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి దోషం ఏర్పడింది. రాశ్యధిపతి శనీశ్వరుడే అయినందు వల్ల ఎక్కువగా బాధించే అవకాశం ఉండకపోవచ్చు. అయితే, గట్టి ప్రయత్నంతో తప్ప ఏ పనీ ముందుకు సాగకపోవచ్చు. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఏ వ్యవహారమైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మొండి బాకీలతో ఇబ్బందులు తలెత్తుతాయి. కొద్దిగా అనా రోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది కానీ, పనిభారం పెరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి 12వ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీనివల్ల ఆదాయం తక్కువ, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రతి పనినీ ఒంటి చేత్తో పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ కార్యాల మీద కూడా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యాలకు కూడా అవకాశం ఉంటుంది. అయితే, 12వ స్థానం శని స్వస్థానమైనందువల్ల ఈ సమస్యల ప్రభావం మరీ ఎక్కువగా ఉండే అవకాశం లేదు.