Horoscope Today: వారికి ఉద్యోగ జీవితంలో అనుకూల మార్పులు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 8, 2024): మేషరాశి వారికి ఈ రోజు హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మిథున రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి ఉద్యోగ జీవితంలో అనుకూల మార్పులు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 08th July 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 08, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూలై 8, 2024): మేషరాశి వారికి ఈ రోజు హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మిథున రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెల్లుబాటు అవుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో లాభాలకు ఏమాత్రం లోటుండదు. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. స్నేహితుల మీద ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడ తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనారోగ్య సమస్యలేవీ ఉండకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగి కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇష్టమైన మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం వల్ల ఉపయోగం ఉంటుంది. తల్లి తండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. లావాదేవీలు, కార్యకలాపాలు కూడా ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో బాగా బిజీ అయిపోతారు. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి జీవితంలో ఉన్న వారికి ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఏ రంగానికి చెందినవారైనా బాగా పురోగతి చెందడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మిత్రుల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

శుభ గ్రహాల అనుగ్రహం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. ఉద్యోగం మారడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అవసరం.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. పెళ్లి ప్రయత్నాలకు కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ముఖ్యమైన పనులన్నీ పూర్తయి, ఊరట లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా అనేక అంశాల్లో అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు తప్పకుండా పూర్తవుతాయి. మనసులోని కోరిక ఒకటి అనుకో కుండా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితి సామరస్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికా రుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు మార్పులు, చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

మిత్రుల మీదా, విలాసాల మీదా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా, పొదుపుగా ఉంటే అంత మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభి స్తుంది. కొద్దిగా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సంద ర్శిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో బాధ్యతలు అధికమవుతాయి. బయటి పనుల్లో శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. అన వసర ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా గడిచిపోతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆస్తి సమస్య పరిష్కారంలో రాజీమార్గం అను సరి స్తారు. వాహన యోగం పడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు మాత్రం బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలకు, కొత్త కార్యక్రమాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగు తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆలయాలను సందర్శించడం, దైవ కార్యాల్లో పాల్గొనడం వంటివి ఎక్కువగా జరుగుతాయి. ఆధ్యా త్మిక వ్యవహారాల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. కొద్ది శ్రమతో ముఖ్య మైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గి, ఊరట లభిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది కానీ, బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి.