Happiest Zodiac Signs: సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత ఈ రాశుల వారికి సొంతం..!

అందరూ కోరుకునే సుఖ సంతోషాలు, మనశ్శాంతి ఈ ఏడాది ఏ రాశులవారికి సొంతం కాబోతున్నాయి? కష్టనష్టాలున్నా ఏ రాశివారు నిబ్బరంగా నిశ్చలంగా ఉండబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానంగా వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశుల వారు సహజంగానే నిబ్బరంగా, ప్రశాంతంగా ఉండగలరు.

Happiest Zodiac Signs: సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత ఈ రాశుల వారికి సొంతం..!
Happiest Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 08, 2024 | 3:12 PM

అందరూ కోరుకునే సుఖ సంతోషాలు, మనశ్శాంతి ఈ ఏడాది ఏ రాశులవారికి సొంతం కాబోతున్నాయి? కష్టనష్టాలున్నా ఏ రాశివారు నిబ్బరంగా నిశ్చలంగా ఉండబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానంగా వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశుల వారు సహజంగానే నిబ్బరంగా, ప్రశాంతంగా ఉండగలరు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టనష్టాలు వాటిల్లినా వీరు నవ్వుతూ, నవ్విస్తూ ఉండగలరు. ఈ ఏడాది ఈ రాశుల వారికి శుభ గ్రహాలు మరింత అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి సుఖ సంతోషాలే. వీరి మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉండదు.

  1. వృషభం: ఈ రాశివారికి శుక్రుడు అధిపతి అయినందువల్ల సాధారణంగా ఈ రాశివారు ఎన్ని కష్టాలు వచ్చినా చెక్కుచెదరరు. మానసిక ప్రశాంతతను కోల్పోరు. పైగా ఇతరుల కష్టాలను కూడా పంచు కుంటారు. ప్రస్తుతం ఈ రాశిలో గురు సంచారం జరుగుతున్నందువల్ల ఈ ఏడాది వీరి సుఖ సంతో షాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖప్రదంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ నిబ్బరంగా వీటిని పూర్తి చేస్తారు.
  2. కర్కాటకం: మనఃకారకుడైన చంద్రుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఏ విషయంలోనూ మానసికంగా కుంగిపోవడం జరగదు. దేనినైనా నిబ్బరంగా, ప్రశాంతంగా తీసుకోవడం జరుగు తుంది. ఎంతటి కష్టంలోనైనా నవ్వుతూ ఉండడం వీరి నైజంగా ఉంటుంది. ఈ ఏడాదంతా లాభ స్థానంలో గురు సంచారం జరుగుతున్నందువల్ల వీరికి అనేక విషయాల్లో అనుకూలతలు పెరు గుతాయి. వృత్తి, ఉద్యోగాలే కాక, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటాయి.
  3. తుల: ఈ రాశికి కూడా శుక్రుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఎక్కువగా సంతోషంగా ఉండ డానికే ప్రయత్నిస్తారు. ఎటువంటి కష్టమైన బెదరడం ఉండదు. ఆటుపోట్లకు ఒక పట్టాన చలిం చరు. ప్రతి విషయంలోనూ సంతోషాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ ఏడాదంతా శుక్రుడే కాక, హాస్యస్ఫూర్తికి మారుపేరైన బుధుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి జీవితం నల్లేరు మీద బండిలా, తామరాకు మీద నీటి బొట్టులా సాగిపోతుంది. విలాస జీవితం అనుభవిస్తారు.
  4. ధనుస్సు: ఈ రాశ్యధిపతి గురువు వృషభ రాశిలో సంచారం చేయడం, తృతీయ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒక పట్టాన కష్టాలు రాకపోవచ్చు. ఎటువంటి కష్టనష్టాలు వాటిల్లినా గురువు మహత్యం వల్ల వీరు నిబ్బరంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ఏడాదంతా ఈ రెండు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండడం జరుగుతుంది.
  5. మకరం: ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి అయినందువల్ల సాధారణంగా ఈ రాశివారు మిన్ను విరిగి మీద పడినా చలించరు. ఎటువంటి పరిస్థితులలోనూ మానసిక ప్రశాంతతను చెడగొట్టుకోరు. కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడపడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఏడాదంతా కుటుంబ స్థానాధి పతి, ధన స్థానాధిపతి అయిన శని స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందు వల్ల ఆదాయ పరంగా, కుటుంబపరంగా వీరు దిగులు చెందాల్సిన అవసరం ఉండదు. ప్రశాంత జీవితానికి లోటుండదు.
  6. మీనం: ఈ రాశికి గురువు అధిపతి అయినందువల్ల, ఈ గురువు శుక్ర క్షేత్రమైన వృషభరాశిలో ఉన్నందు వల్ల వీరు ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదు. ఎటువంటి కష్టనష్టాలైనా ఆధ్యాత్మిక దృష్టికోణంలో తీసుకోవడం వీరి నైజం అయినందువల్ల వీరికి మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ నిబ్బరంగా వ్యవహరిస్తారు. ఈ ఏడాదంతా గురు, శుక్రులిద్దరూ అనుకూల సంచారం చేస్తున్నందువల్ల మానసిక, భౌతిక సుఖ సంతోషాలకు లోటుండదు.