Zodiac Signs: గురువుతో కుజుడు కలయిక.. ఆ రాశుల వారికి ఆదాయం, అధికారం..!
ఈ నెల 12 మేష రాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశిస్తున్న కుజుడు వృషభ రాశిలోనే ఉన్న గురువుతో యుతి చెందుతాడు. ఇవి రెండూ మిత్ర గ్రహాలు. ఇందులో గురువు ధన కారకుడు కాగా కుజుడు యాంబిషన్ కు కారకుడు. ఈ రెండు గ్రహాలు సహజ ధన స్థానమైన వృషభ రాశిలో కలవడం అరుదైన విషయం. వీటి కలయిక వల్ల ఆదాయం పెరగడానికి, అధికారం చేపట్టడానికి, అందలాలు ఎక్కడానికి అనుకోకుండా చేయూత లభించే అవకాశం ఉంటుంది.
ఈ నెల 12 మేష రాశి నుంచి వృషభ రాశిలో ప్రవేశిస్తున్న కుజుడు వృషభ రాశిలోనే ఉన్న గురువుతో యుతి చెందుతాడు. ఇవి రెండూ మిత్ర గ్రహాలు. ఇందులో గురువు ధన కారకుడు కాగా కుజుడు యాంబిషన్ కు కారకుడు. ఈ రెండు గ్రహాలు సహజ ధన స్థానమైన వృషభ రాశిలో కలవడం అరుదైన విషయం. వీటి కలయిక వల్ల ఆదాయం పెరగడానికి, అధికారం చేపట్టడానికి, అందలాలు ఎక్కడానికి అనుకోకుండా చేయూత లభించే అవకాశం ఉంటుంది. మిత్రుల ద్వారా, పరిచయాల ద్వారా లభ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక ఆగస్టు 26 వరకూ కొనసాగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ కలయిక తప్పకుండా శుభ ఫలితాలనిస్తుంది.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో ధన కారకుడితో రాశ్యధిపతి కుజుడు కలవడం వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అధికారులు లేదా యాజమాన్యాల కారణంగా ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటకు తీసుకు వచ్చే మిత్రులు రంగ ప్రవేశం చేయడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలకు కూడా అవసరమైన వైద్య సహాయం అందు తుంది. నిరుద్యోగులకు కొందరు మిత్రుల ద్వారా ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశిలో కుజ, గురువుల కలుస్తున్నందువల్ల ఆదాయపరంగానే కాక, ఉద్యోగపరంగా కూడా ఈ రాశివారికి దశ తిరిగే సూచనలున్నాయి. కొందరు మిత్రుల వల్ల అదనపు ఆదాయ మార్గాలు అంది వస్తాయి. అధికారుల సహాయ సహకారాలతో పని భారం, పని ఒత్తిడి, టెన్షన్ల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారానికి కుటుంబ సభ్యుల నుంచి సరైన సలహాలు, సూచనలు అందుతాయి. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, గురుల సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో కొత్త భాగస్వాములు చేరే అవకాశం ఉంది. ఆశించిన పెట్టుబడులు లభించడానికి కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మిత్రులతో పాటు చిన్ననాటి మిత్రులు, కొత్త పరిచయాలు కూడా ఆదాయపరంగా చేయూతనం దించే సూచనలున్నాయి. ఈ రాశివారు తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరు గుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారుల సాయంతో హోదా పెరుగుతుంది.
- సింహం: ఈ రాశికి పదవ స్థానంలో కుజ, గురుల సంచారం వల్ల ఉద్యోగపరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా అధికారుల ప్రోద్బలంతో ఈ రాశివారికి పదోన్నతులు దక్కడం, జీతభత్యాలు పెరగడం వంటివి సంభవిస్తాయి. ఈ రాశివారికి ప్రతిభను, శక్తి సామర్థ్యాలను అధికా రులు గుర్తించి అందలాలు ఎక్కించడం జరుగుతుంది. తల్లితండ్రుల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కే అవకాశం ఉంటుంది. మిత్రుల తోడ్పాటుతో ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ, గురువుల సంచారం వల్ల ధన యోగం, అధికార యోగం కలిగే అవకాశం ఉంది. బంధువుల కారణంగా సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం అయ్యే సూచనలు న్నాయి. మిత్రుల సహాయం ప్రేమ వ్యవహారాలు విజయం సాధిస్తాయి. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించి అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అధికారుల ప్రోద్బలంతో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములు కలిసి రావడంతో లాభాలు పెరుగుతాయి.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, గురుల యుతి వల్ల ప్రముఖులతో లాభదాయక పరిచయాలు విస్తృతం కావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిచయాల ద్వారా ఆదాయపరంగానే కాక, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఉద్యో గంలో అధికారులు, యాజమాన్యాల నుంచి విశేషమైన ప్రోత్సామం ఉంటుంది. అధికారుల సిఫార సుల కారణంగా విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. అనారోగ్య తగ్గ వైద్య సహాయం లభిస్తుంది.