Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జూలై 7 నుంచి జూలై 13, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 07th July 2024 To 13th July 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 07, 2024 | 5:01 AM

వార ఫలాలు (జూలై 7 నుంచి జూలై 13, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. కొన్ని కొత్త పనులకు, కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి జీవితం అనేక విధాలుగా పురోగతి చెందుతుంది. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు ఇది అనుకూలమైన సమయం. ఆహార విహారాల్లో జాగ్రతగా ఉండడం మంచిది. పిల్లలు ఊహించని విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని ప్రతిబంధకాలు ఉంటాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. పుణ్య క్షేత్రానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి. ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం మారడా నికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో గానీ, విదేశాల్లో గానీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొత్త ప్రయత్నాలు, పనులు చేపట్టే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి పెళ్లికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి జీవితంలో చాలా కాలంగా పడుతున్న శ్రమకు సరైన ప్రతిఫలం లభిస్తుంది. ప్రతిభా పాటవాలకు సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి విలువైన వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా గడిచి పోతుంది. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన వ్యవహారా లన్నిటినీ సునాయాసంగా పూర్తి చేస్తారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

బాగా వ్యయ ప్రయాసలతో కానీ, వ్యవహారాలు, పనులేవీ పూర్తి కావు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందకపోవచ్చు. ప్రయాణాల్లో లాభాలకు కొదవ లేనప్పటికీ, బాగా శ్రమను కలిగిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆధ్యా త్మిక చింతన పెరిగి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఆశించిన స్థాయి లాభాలను ఇవ్వకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా, సామరస్యంగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బం దేమీ ఉండదు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరే అవకాశం కూడా ఉంది. అయితే, కొద్దిపాటి అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమపడతారు. కుటుంబ జీవితం బాగానే సాగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీఉండకపోవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఈ వారం బాగా సానుకూలంగా గడిచిపోతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నిటిలో విజయాలు సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందు తారు. అనుకోకుండా ఇంటి నిర్మాణాన్ని చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కీలక మార్పులు చేసి ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. ఉద్యోగం మరింత ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన డిమాండ్ చోటు చేసుకుంటుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయ త్నంతో ఆర్థిక అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందు తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆస్తి వివాదాలు, ఆర్థిక వివాదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు సరికొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయట పడ తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధి స్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థికంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కొందరు సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటం కాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా బాగా మెరుగైన పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు, ఆర్థిక అవసరాలు బాగా తగ్గే సూచనలు న్నాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుకుంటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొందరు బంధుమిత్రులతో వివాదాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక ప్రదానాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక బాధ్యతలను ఇతరులకు అప్పగించకపోవడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. స్థాన చలన సూచనలున్నాయి. తల్లితండ్రుల నుంచి ఆస్తిపాస్తుల పరంగా ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ఇంటి మరమ్మతులు చేపడతారు. ఆర్థిక సమస్యల్లో చాలా భాగం పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, రాబడికి లోటుం డదు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎంతో నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవు తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల చదువులకు సంబంధించి ఊహించని శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయా ణాలకు అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారుల అండదండలు లభి స్తాయి. ముఖ్యంగా వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిపోతుంది. సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. కొత్త నిర్ణ యాలకు, కొత్త ప్రయత్నాలకు విజయం లభిస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు సరికొత్త బాధ్యతలు అప్పగించడం వల్ల పనిభారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం ఒక మోస్తరుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తల్లితండ్రుల జోక్యంతో సోదరులతో ఆర్థిక వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాల ని స్తాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. అనవసర ఖర్చుల్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. అయితే, అదనపు ఆదాయం కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. వ్యాపారాల మీద ఎంత శ్రద్ధ పెడితే అంతగా లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. మీ ప్రతిభా పాటవాలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హాయిగా సాగిపోతుంది.