Marriage Astrology: కర్కాటక రాశిలో శుక్రుడు.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగాలు..!
Marriage Horoscope 2024: ఈ నెల 1వ తేదీతో గురు మౌఢ్యం, 7వ తేదీతో శుక్ర మౌఢ్యం (మూఢమి) తొలగిపోతున్నందు వల్ల, సహజ కుటుంబ స్థానమైన కర్కాటక రాశిలో శుక్రుడి ప్రవేశం వల్ల పెళ్లి ప్రయత్నాలకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. జూలై నెలలో (ఆషాఢంలో) ప్రయత్నాలు ప్రారంభించే పక్షంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో (శ్రావణ మాసం)లో పెళ్లి కుదరడానికి అవకాశమున్న రాశులు ఇవే..
ఈ నెల 1వ తేదీతో గురు మౌఢ్యం, 7వ తేదీతో శుక్ర మౌఢ్యం (మూఢమి) తొలగిపోతున్నందు వల్ల, సహజ కుటుంబ స్థానమైన కర్కాటక రాశిలో శుక్రుడి ప్రవేశం వల్ల పెళ్లి ప్రయత్నాలకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. జూలై నెలలో (ఆషాఢంలో) ప్రయత్నాలు ప్రారంభించే పక్షంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో (శ్రావణ మాసం)లో పెళ్లి కుదరడానికి అవకాశమున్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులు. కొద్ది ప్రయత్నంతో గానీ, అప్రయత్నంగా గానీ ఈ రాశులవారికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అందులోనూ దాంపత్యపరంగా అనుకూల సంబంధాలు కుదరడానికి బాగా అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి కుటుంబ స్థానం, సుఖ స్థానం అయిన కర్కాటక రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా శ్రావణ మాసంలో పెళ్లయ్యే అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సునాయా సంగా ఫలిస్తాయి. సాధారణంగా బంధువర్గంలో పెళ్లి కావడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహా రాలు పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది. సొంత ఊర్లోనే పెళ్లి సంబంధం లభిస్తుంది. పెళ్లి వైభవంగా, ఆడంబరంగా జరిగే సూచనలున్నాయి. వైవాహిక జీవితం సుఖవంతంగా సాగిపోతుంది.
- మిథునం: ఈ రాశికి రెండవ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అతి త్వరలో పెళ్లయ్యే అవకాశం ఉంది. కొద్ది పాటి ప్రయత్నంతో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. తోటి ఉద్యోగితో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం కూడా ఉంది. దూర ప్రాంతం నుంచి పరిచయస్థుల సహాయంతో పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆడంబ రంగా పెళ్లి జరుగుతుంది. సాధారణంగా వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.
- కర్కాటకం: ఇదే రాశిలో శుక్ర సంచారం వల్ల అతి త్వరలో అనుకోకుండా, ఊహించని విధంగా పెళ్లయ్యే అవ కాశం ఉంది. సాధారణంగా కొద్ది ప్రయత్నంతో విదేశీ సంబంధం ఖాయమయ్యే సూచనలు న్నాయి. కొందరు బంధువులు లేదా మిత్రుల ద్వారా కలలో కూడా ఊహించని పెళ్లి సంబంధం కుదురు తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం జరుగుతుంది. పెళ్లి స్వదేశంలో ఎంతో వైభవంగా జరుగుతుంది. వైవాహిక జీవితం నిత్య కల్యాణం, పచ్చతోరణంలా సాగిపోతుంది.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల శ్రావణ మాసంలోనే పెళ్లడానికి ఈ రాశివారికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇప్పుడు చేపట్టే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అయితే, ప్రేమ వివాహం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. పరిచయస్థుల్లో ఇష్టపడిన వ్యక్తితో సంబంధం ఖాయమయ్యే అవకాశం కూడా ఉంది. సాధారణంగా విదేశాల్లో స్థిరపడిన సాటి ఉద్యోగితో పెళ్లి కుద రడం జరుగుతుంది. పెళ్లి వైభవంగా జరుగుతుంది. వివాహ బంధం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం వల్ల శ్రావణ మాసంలో తప్పకుండా వివాహం జరుగు తుంది. స్నేహితుల ప్రమేయంతో తోటి ఉద్యోగితో పెళ్లయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. సమాజంలో పలుకుబడి కలిగిన కుటుంబంతో సంబంధం కుదురుతుంది. ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సాధా రణంగా పెళ్లి నిరాడంబరంగా జరిగే అవకాశం ఉంటుంది. వివాహ బంధం సుఖప్రదంగా సాగిపోతుంది.
- మీనం: ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో బంధువర్గంలో లేదా అత్యంత సన్నిహితులతో అతి త్వరలో పెళ్లయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశిలో శుక్రుడు బుధుడితో యుతి చెందినందువల్ల సాధార ణంగా ప్రేమ వివాహం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో లేదా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరిగే సూచనలున్నాయి. వివాహ బంధం నిత్య కల్యాణం, పచ్చతోరణంలా సాగిపోతుంది.