Kuja Gochar 2024: వృషభ రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారికి అన్ని శుభ యోగాలే..!

Mars Transit 2024: ఈ నెల 12 నుంచి కుజుడు వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఆగస్టు 26వ తేదీ వరకూ ఇదే రాశిలో సంచారం చేసే కుజుడి వల్ల కొన్ని రాశుల వారిలో మొండి పట్టుదల పెరుగుతుంది. డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది. శృంగార వాంఛలు పెరుగుతాయి. అధికారం కోసం పరితపించడం జరుగుతుంది. ప్రస్తుతం సొంత రాశి అయిన మేషంలో సంచారం చేస్తున్న కుజుడు తనకు తటస్థ రాశి అయిన వృషభంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల..

Kuja Gochar 2024: వృషభ రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారికి అన్ని శుభ యోగాలే..!
Mars Transit 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 06, 2024 | 1:30 PM

Mangal Gochar 2024: ఈ నెల 12 నుంచి కుజుడు వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఆగస్టు 26వ తేదీ వరకూ ఇదే రాశిలో సంచారం చేసే కుజుడి వల్ల కొన్ని రాశుల వారిలో మొండి పట్టుదల పెరుగుతుంది. డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది. శృంగార వాంఛలు పెరుగుతాయి. అధికారం కోసం పరితపించడం జరుగుతుంది. ప్రస్తుతం సొంత రాశి అయిన మేషంలో సంచారం చేస్తున్న కుజుడు తనకు తటస్థ రాశి అయిన వృషభంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఆరు రాశులకు మాత్రమే శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఈ కుజుడి రాశి మార్పువల్ల కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలతో ముందుకు దూసుకు వెళ్లే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ధన స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల వీరిలో ధన వ్యామోహం పెరుగుతుంది. అదనపు ఆదాయానికి అవసరమైన శక్తియుక్తులు ఉధృతం అయ్యే అవకాశం ఉంది. ఏ పని లేదా ప్రయత్నం తలపెట్టినా మొండిగా, పట్టుదలగా వ్యవహరించడం జరుగుతుంది. శృంగార సంబంధమైన కోరికలు విజృంభిస్తాయి. ఎంత శ్రమకైనా ఓర్చుకోగల శక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడు, యోగకారకుడు అయిన కుజుడు లాభ స్థానంలో సంచరించడం వల్ల వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి అంచనాలకు మించి పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. లైంగిక సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  3. సింహం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల దిగ్బల యోగం పట్టింది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు వరిస్తాయి. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరించడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో స్థిరత్వం లభిస్తుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. దాంపత్యంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. శృంగార సంబంధ మైన కోరికలు విజృంభిస్తాయి. అక్రమ సంబంధాల కోసం ఆరాటపడే అవకాశాలున్నాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. రావలసిన సొమ్మును, బాకీలు, బకాయిలను పట్టుదలగా వసూలు చేసుకోవడం జరుగుతుంది. విలాస జీవితం గడపడానికి అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలు దూసుకుపోతాయి. గట్టి ప్రయ త్నంతో వ్యాపారాలను నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటికి తీసుకు రావడం జరుగు తుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు షేర్లు, వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ సంచారం వల్ల ధైర్య సాహసాలు, మొండి పట్టుదల, చొరవ వంటివి విజృంభిస్తాయి. కొద్దిపాటి చొరవతో ఆస్తి వివాదాల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు సమసిపోతాయి. ఉద్యోగంలో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ముందుకు దూసుకుపోతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. విదేశీయానానికి, విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.