Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
దిన ఫలాలు (జనవరి 5, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జనవరి 5, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగులకు ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మీ సలహాలు, సూచనలు బంధుమిత్రులకు లాభం కలిగిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉన్నత స్థాయి వ్యక్తుల సహచర్యం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సహచరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో పనిభారం ఉన్నా ఫలితం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులు తప్పకుండా శుభ వార్త వింటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజ నాలు నెరవేరుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారా లలో కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని విధాలుగానూ ఆర్థికంగా పుంజుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడానికి ఇది అనుకూల సమయం. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా సఫలం అవుతుంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు చదువుల్లో బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల బెడద కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వ హణలో అప్రమత్తంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి తప్పక పోవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలలో పనిభారం, ఒత్తిడి తప్పకపోవచ్చు. వేధింపులకు కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. లాటరీ, జూదం, వడ్డీ వ్యాపారం వంటి వాటి వల్ల ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. నిరుద్యోగులకు మంచి శుభవార్త అందవచ్చు. మీ ప్రయత్నాలు, ఆలోచనలు, నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల అభివృద్ధికి సంబంధించి అనుకూల వార్తలు వింటారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో లావాదేవీలు, కార్యకలాపాలు పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొం టారు. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చవద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులున్నా బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన పనుల్లో అవ రోధాలు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలలో డబ్బు నష్టపోతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవ కా శం ఉంది. సతీమణికి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగి పో తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలలో బాగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. అలవికాని లక్ష్యాలు మీదపడతాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధపెట్టడం అవసరం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వాగ్దానాలు, హామీలకు సమయం అనుకూలంగా లేదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అవసర సమయాల్లో మిత్రుల అండ లభిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టడం మంచిది. సన్నిహితులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఉద్యోగం ఉత్సా హంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగడం శ్రేయస్కరం కాదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగి పోతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ధన లాభం పొందుతారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐ.టి నిపుణుల వంటి వృత్తుల వారు పురోగతి చెందుతారు. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆర్థిక ప్రయత్నాల వల్ల ప్రయోజనం పొందుతారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవు తాయి.