AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Horoscope: వృశ్చిక రాశిలో బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి ప్రేమ యోగం పక్కా.. !

వృశ్చిక రాశిలో బుధ, శుక్రులు కలవడం వల్ల ప్రేమ జీవితాలు కొత్త పుంతలు తొక్కబోతున్నాయి. ఇంత వరకూ ప్రేమ వ్యవహారాల్లో పడని కొత్తవారికి ప్రేమ వ్యవహారాల్లో పడాలనే ఆలోచన కలుగు తుంది. బుధుడు నిత్వ యువకుడు కావడం, దానితో శృంగార రసాధి దేవత అయిన శుక్రుడు వృశ్చికంలో కలవడం ఎవరిలోనైనా ప్రేమను ప్రేరేపిస్తుంది.

Love Horoscope: వృశ్చిక రాశిలో బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి ప్రేమ యోగం పక్కా.. !
love horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 04, 2024 | 5:57 PM

వృశ్చిక రాశిలో బుధ, శుక్రులు కలవడం వల్ల ప్రేమ జీవితాలు కొత్త పుంతలు తొక్కబోతున్నాయి. ఇంత వరకూ ప్రేమ వ్యవహారాల్లో పడని కొత్తవారికి ప్రేమ వ్యవహారాల్లో పడాలనే ఆలోచన కలుగు తుంది. బుధుడు నిత్వ యువకుడు కావడం, దానితో శృంగార రసాధి దేవత అయిన శుక్రుడు వృశ్చికంలో కలవడం ఎవరిలోనైనా ప్రేమను ప్రేరేపిస్తుంది. వృశ్చిక రాశి ఎక్కువగా రహస్య ప్రేమలకు, అందుకు సంబంధించిన కార్యకలాపాలకు అవకాశం ఇస్తుంది. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ అవకాశం కలుగుతుంది. కొత్తగా ప్రేమ వ్యవహారాలు అంకురించడానికి ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. ఇది దాదాపు ఏప్రిల్ మొదటి వారం వరకూ కొనసాగుతుంది.

  1. వృషభం: ఈ రాశ్యధిపతి అయిన శుక్రుడు సప్తమ రాశిలో బుధుడితో కలవడం వల్ల ఈ రాశికి చెందిన యువతీ యువకుల్లో తప్పకుండా ప్రేమ బీజం పడుతుంది. మొదటి చూపులోనే ప్రేమలో పడి పోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా కాలేజీల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ ప్రేమ వ్యవహా రాలు ప్రారంభం కావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రేమల్లో పడినవారికి ప్రేమ బంధం పటిష్టంగా మారుతుంది. నీతి నిజాయతీలతో ముందుకు సాగుతుంది. ఇది తప్పకుండా పెళ్లికి దారితీస్తుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో, అంటే ఆలోచనా స్థానంలో, బుధ, శుక్రుల కలయిక జరుగుతు న్నందువల్ల, చాలా కాలంగా స్నేహంలో లేదా పరిచయంలో ఉన్నవారితో ప్రేమలో పడడం జరుగు తుంది. ఈ ప్రేమ పటిష్టమైన అనుబంధంగా సాగుతుంది. కొద్ది రోజుల్లోనే ఇది సాన్నిహిత్యంగా మారి, పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. సాధారణంగా వృత్తి, ఉద్యోగాల్లో సహచరులతో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఈ కలయిక మీద శని దృష్టి ఉన్నందువల్ల పెళ్లి వ్యవహారం కొద్దిగా ఆలస్యం కావచ్చు.
  3. సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖం, కుటుంబానికి సంబంధించిన స్థానంలో బుధ, శుక్రుల యుతి జరుగుతున్నందువల్ల ఈ రాశివారు విద్యాసంస్థల్లోనే, ముఖ్యంగా విద్యార్థి దశలోనే ప్రేమల్లో పడడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఈ ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీయడానికి ఎక్కువ కాలమే పట్టవచ్చు. ఈ రాశివారికి ప్రేమలో పడడానికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రేమ వ్యవహారాలు ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి.
  4. తుల: ఈ రాశికి ద్వితీయ స్థానంలో బుధ, శుక్రుల కలయిక జరిగినందువల్ల ఈ రాశివారికి ఒక సంపన్న వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమలో పడే అవకాశం ఉంది. ఒకే సంస్థలో సహచరులు కావచ్చు. ద్వితీయ స్థానం ధనం, కుటుంబానికి సంబంధించిన స్థానం అయినందువల్ల తప్పకుండా పెళ్లికి దారితీయడం జరుగుతుంది. అయితే, ప్రేమ వ్యవహారం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా, సామరస్యంగా జరిగిపోతాయని చెప్పవచ్చు.
  5. వృశ్చికం: ఇదే రాశిలో శుక్ర, బుధులు కలుస్తున్నందువల్ల బంధువర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. బంధువుల రాకపోకల్లో ప్రేమ అంకురించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రేమ వ్యవహారాల్లో రహస్య కార్యకలాపాలు, దూకుడుతనం, సాన్నిహిత్యం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ ప్రేమ వ్యవహారం కొద్దిగా ఆలస్యంగానైనా పెళ్లికి దారితీసే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఈ రాశివారికి ఇబ్బందులు, ఆటంకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశివారు లాభ స్థానంలో ఏర్పడే శుక్ర, బుధుల యుతి వల్ల తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. సాధారణంగా ఉద్యోగ సంస్థల్లోనో, ఒకే వృత్తిలో ఉన్నవారితోనో ప్రేమలో పడడం జరుగుతుంది. ఈ ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహా రాల్లో విజయం సాధించిన ఈ రాశివారు స్వల్ప కాలంలోనే పెళ్లి చేసుకోవడానికి అవకాశముంటుంది. ఈ రాశినాథుడు శనీశ్వరుడి దృష్టి వల్ల ఈ ప్రేమ వ్యవహారం రహస్యంగా ఉండకపోవచ్చు.
  7. మీనం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల తప్పకుండా ప్రేమ యోగం పట్టే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి కార్యక్రమం వల్ల ఈ రాశివారికి అదృష్టం పడు తుంది. సాధారణంగా సంపన్న వ్యక్తితోగానీ, విదేశాలలో స్థిరపడిన వ్యక్తితో గానీ అనుకో కుండా ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. అతి కొద్ది కాలానికే పెళ్లయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది.

పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత
అతి తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఆ కార్డులతో మరింత డిస్కౌంట్..!
అతి తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. ఆ కార్డులతో మరింత డిస్కౌంట్..!
ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉండదు
ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉండదు
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు..
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు..
OU ఆర్ట్స్‌ కాలేజ్ భవనానికి ఇండియన్‌ ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్
OU ఆర్ట్స్‌ కాలేజ్ భవనానికి ఇండియన్‌ ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్
వాటర్‌ కోసం ఫ్రిజ్‌ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్‌..
వాటర్‌ కోసం ఫ్రిజ్‌ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్‌..
ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విదురుడు క్లారిటీగా చెప్పాడు
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విదురుడు క్లారిటీగా చెప్పాడు