AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుకూల స్థితిలో రెండు కీలక గ్రహాలు.. మరో మూడు నెలల పాటు వారికి అపురూప రాజయోగం..!

ఓ మూడు నెలల పాటు, అంటే మార్చి ఆఖరు వరకు, ఆరు రాశుల వారికి జీవితం హుందాగా, దర్పంగా, రాజసంగా గడిచిపోబోతోంది. ఈ రాశుల వారికి సంబంధించినంత వరకూ కుజ, రవులు అనుకూలంగా, ముఖ్యంగా కేంద్ర స్థానాల్లో, సంచరిస్తుండడంతో ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, కుటుంబ పరిస్థితులు ఉచ్ఛ స్థితికి మారుతుండడంతో ఈ రాశుల వారు అత్యధికంగా లబ్ధి పొందడం జరుగుతుంది.

అనుకూల స్థితిలో రెండు కీలక గ్రహాలు.. మరో మూడు నెలల పాటు వారికి అపురూప రాజయోగం..!
Rajayoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 03, 2024 | 4:27 PM

Share

ఓ మూడు నెలల పాటు, అంటే మార్చి ఆఖరు వరకు, ఆరు రాశుల వారికి జీవితం హుందాగా, దర్పంగా, రాజసంగా గడిచిపోబోతోంది. ఈ రాశుల వారికి సంబంధించినంత వరకూ కుజ, రవులు అనుకూలంగా, ముఖ్యంగా కేంద్ర స్థానాల్లో, సంచరిస్తుండడంతో ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, కుటుంబ పరిస్థితులు ఉచ్ఛ స్థితికి మారుతుండడంతో ఈ రాశుల వారు అత్యధికంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ రాశులుః మేషం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు హుందాతనానికి, డాబూ దర్పానికి, రాజసానికి కారకుడైన రవితో కలిసి భాగ్య స్థానంలో సంచరిస్తున్నందువల్ల, ఈ రాశివారికి తప్పకుండా రాజయోగం ఇవ్వడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబ సమస్యలు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆత్మ విశ్వాసం బాగా ఇనుమడిస్తుంది.
  2. మిథునం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో కుజ, రవుల యుతి ఏర్పడినందువల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగా ల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. తలపెట్టిన ప్రతి ప్రయత్నమూ నెర వేరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సమాజంలోని అతి ముఖ్యమైన వ్యక్తులతో సైతం పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. స్నేహితులు, బంధువులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడం వల్ల పలుకుబడి పెరుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఏర్పడిన కుజ, రవుల యుతి వల్ల ఈ రాశివారిలో అనేక విధాలుగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదుగుతారు. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రుల్లో పలుకుబడి పెరుగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశినాథుడైన కుజుడికి ద్వితీయ స్థానంలో రవితో యుతి ఏర్పడడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. సామాజికంగా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీరు ఎంత చెబితే అంత అన్న పరిస్థితి ఏర్పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలతో బంధు మిత్రులు ప్రయోజనం పొందుతారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశిలో కుజ, రవుల సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నవారికైనా హోదా పెరుగుతుంది. తప్ప కుండా అధికార యోగం పడుతుంది. ఊహించని విధంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.
  6. మీనం: ఈ రాశివారికి దశమ స్థానంలో కుజ, రవుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అంది వస్తాయి. డిమాండ్, పలుకుబడి పెరుగుతాయి. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వచ్చి, ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..