Horoscope Today: వారికి తక్కువ శ్రమతో ఎక్కువ లాభం.. 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు

Today Horoscope in Telugu (December 1, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మిథున రాశి వారికి ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి తక్కువ శ్రమతో ఎక్కువ లాభం.. 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 01st December 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 01, 2024 | 5:45 AM

దిన ఫలాలు (డిసెంబర్ 1, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మిథున రాశి వారికి ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహ బలం వల్ల సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సమర్థ తకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆస్తి విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు కానీ మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందక కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుం జీవితం హ్యాపీగా సాగిపో తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. రావలసిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధార పడకపోవడం మంచిది. దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సకాలం పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవ కాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు సమసిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. బాగా సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. బంధువులతో కలిసి శుభ కార్యాలలో పాల్గొంటారు. అదనపు ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది ప్రయత్నంతో పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు ఆశించిన విలువనిస్తారు.

కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. రావలసిన డబ్బు సకా లంలో చేతికి అందుతుంది. వ్యక్తిగత సమస్యలు కూడా చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబెడతారు. జీవిత భాగస్వామితో సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా బరువు బాధ్యతలు పెరుగు తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, కొత్త ఆఫర్లు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవు తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొత్తగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యా నికి లోటుండదు. అవసరానికి తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. వృత్తి, ఉద్యో గాలలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అన్నదమ్ములతో ఆస్తి సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత సమ స్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలు జోరందుకుంటాయి. వ్యక్తిగత సమస్యలు నిదానంగా సర్దుకుంటాయి. చేప ట్టిన ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. సోదరులతో విభేదాలు, అపార్థాలు తొలగి పోతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు న‌ష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. శ్రమాధిక్యత ఉన్నా అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?