Horoscope Today: ఆదాయ ప్రయత్నాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (December 2, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. మిథున రాశి నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆదాయ ప్రయత్నాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 02nd December 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 02, 2024 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 2, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. మిథున రాశి నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు సమ యా నికి పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపో తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో మీ శక్తి సామర్థ్యాలు బాగా ఉపయోగపడతాయి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా ఉపయోగపడతాయి. వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు అందుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలు పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో కలిసి కొందరు బంధువులను సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులు విజయం సాధిస్తారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాలలో పోటీ ఉన్నా లాభాలపరంగా విజ యాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. తల్లి తండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు ప్రోత్సాహ కరంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన సమాధానం లభిస్తుంది. భారీ రుణ సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగులు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతల భారం పడుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ప్రయాణాలలో కొద్దిగా జాగ్ర త్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు తలెత్తవచ్చు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి, అదనపు రాబడికి లోటుండక పోవచ్చు. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బందిపెడతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాలు కొద్దిగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు బాగా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. ముఖ్య మైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికా రులు మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం కలుగుతుంది. వేతనాలు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపా రాలు బాగా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గృహ, వాహన సౌకర్యాలకు ప్రయత్నాలు చేపడతారు. కొందరు ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు శుభ వార్తలు అందు తాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ఒకటి శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తల్లితండ్రుల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర