Holi 2025 Lunar Eclipse: హోలీ రోజున భద్ర నీడలో చంద్రగ్రహణం.. ఈ 4 రాశుల వారు జాగ్రత్త సుమా.. ఆర్థికంగా నష్టపోవచ్చు
రంగుల కేళి హోలీ సందడి మొదలైంది. పాల్గుణ మాసం పౌర్ణమి రోజున హలీ జరుపుకోనున్నారు. అంతేకాదు ఈ సారి హోలీ పండగ రోజున చంద్ర గ్రహణం కూడా ఏర్పనుంది. అయితే ఈ చంద్రగ్రహణం కొన్ని రాశులకు సవాలుగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ప్రభావం వల్ల డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వృత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

హోలీ హిందువులు జరుపుకునే పవిత్ర పండుగ. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున దేశవ్యాప్తంగా రంగుల కోలాహలం కనిపిస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీకి ముందే హోలికా దహనం చేస్తారు. తర్వాత రోజు రంగులతో హోలీ పండగ జరుపుకుంటారు. అయితే ఈసారి హోలికా దహనం సమయంలో భద్రుడి నీడ ఉండనుంది. అంతేకాదు హోలీ రోజున చంద్రుడు గ్రహణం ఏర్పడనుంది.
జ్యోతిష్యం ప్రకారం చంద్ర గ్రహణం
ఈ ఏడాది హోలీ రోజున చంద్రగ్రహణం, భద్ర నీడ కొన్ని రాశుల వారికి మంచిది కాదు. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే హోలీ రోజున గ్రహణం, భద్ర నీడ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుంది.
ఈ ఏడాది హోలీ ఎప్పుడంటే
ఈ సంవత్సరం హోలిక దహనం మార్చి 13న నిర్వహించనున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 13న భద్రుని నీడ ఉదయం 10:35 నుంచి రాత్రి 11:26 వరకు ఉంటుంది. దీని తరువాత మార్చి 14న రంగులతో హోలీ ఆడతారు. హోలీ రోజున అంటే మార్చి 14న చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది.
మిథున రాశి
హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడనున్నందున మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహణం పట్టే సమయం ఈ రాశి వారికి ప్రతికూలతను తెస్తుంది. దీంతో వీరు డబ్బు, ఆస్తి, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కూడా వివాదం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులు పనిలో సమస్యలను ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా హోలీ నాడు వచ్చే చంద్రగ్రహణం వల్ల నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలీ అనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో వ్యాపారంలో నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మకరరాశి
హోలీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా మకర రాశి వారు తమ కెరీర్‌లో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆఫీసులో అధికారులు, సహోద్యోగులతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆదాయం తగ్గవచ్చు.. మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు.
మీన రాశి
హోలీ నాడు చంద్రగ్రహణం కారణంగా మీన రాశి వారు డబ్బు సంపాదించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు ఆదా చేయడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అధిక ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








