Astro Tips: మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులా చంద్రుడి అనుగ్రహం కోసం ఇలా చేసి చూడండి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. ఎవరి జాతకంలో నైనా చంద్రుడు బలహీనంగా వుంటే మనోబలం తగ్గుతుంది.. చంద్రుడు శుభ దృష్టితో ఉంటె మానసిక బలం  పెరుగుతుంది. తొమ్మిది గ్రహాలలోకెల్లా చంద్రుని సంచార వ్యవధి అతి తక్కువ. ఒక రాశిలో దాదాపు రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు. విశేషమేమిటంటే భారతీయ పంచాంగం, జాతకం కేవలం చంద్రుని సహాయంతో తయారు చేయబడుతుంది.

Astro Tips: మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులా చంద్రుడి అనుగ్రహం కోసం ఇలా చేసి చూడండి..
Full Moon Day
Follow us
Surya Kala

|

Updated on: Jul 15, 2023 | 12:51 PM

సనాతన హిందూ సంప్రదాయంలో నవ గ్రహాల్లో ఒకటైన చంద్రుడికి విశిష్ట స్థానం ఉంది. చంద్రుడితో అనేక పండగలు పర్వదినాలు ముడిపడి ఉన్నాయి. హిందూమతంలో సూర్య చంద్రులు ప్రత్యక్షంగా కనిపించే దైవాలు.  సూర్య చంద్రులకు హిందూమతంలో మాత్రమే కాదు, వేద జ్యోతిషశాస్త్రంలో కూడా ముఖ్యమైన స్థానం ఉంది. పున్నమి వెలుగులను పంచె చంద్రుడికి మనిషి జాతకంలో ప్రముఖ స్థానం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి రాశిచక్రం గుర్తును నిర్ణయించడంలో, భవిష్యత్తులో అతను పొందబోయే ఫలితాలను తెలుసుకోవడంలో చంద్రుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. హిందూ మతం, జ్యోతిషశాస్త్రంలో చంద్రుని ప్రాముఖ్యత ఏమిటి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

హిందూమతంలో చంద్రుని ప్రాముఖ్యత

హిందూమతంలో చంద్రుడు లయకారుడు శివయ్య శిగలో అలంకారంగా దర్శనమిస్తాడు. పౌరాణిక కథనం ప్రకారం.. చంద్రుడు మహర్షి అత్రి , అనుసూయల కుమారుడిగా పరిగణించబడుతున్నాడు. భూమిపై మొదటి జ్యోతిర్లింగాన్ని సోమనాథుడి చంద్రుడు ప్రతిష్టించినట్లు విశ్వాసం. హిందూ మతంలో చంద్రుని ఆరాధనతో ముడిపడి శ్రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, వినాయక చవితి వంటి అనేక పండుగలు ఉన్నాయి. సనాతన సంప్రదాయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున చంద్ర దర్శనం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

జ్యోతిషశాస్త్రంలో చంద్రుని ప్రాముఖ్యత

జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మనస్సు , తల్లికి కారకంగా పరిగణిస్తారు. వేద జ్యోతిషశాస్త్రం ఆధారంగా తయారు చేయబడిన జాతకంలో..  ఒక వ్యక్తి రాశిచక్రం చంద్రుని ఆధారంగా నిర్ణయించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. ఎవరి జాతకంలో నైనా చంద్రుడు బలహీనంగా వుంటే మనోబలం తగ్గుతుంది.. చంద్రుడు శుభ దృష్టితో ఉంటె మానసిక బలం  పెరుగుతుంది. తొమ్మిది గ్రహాలలోకెల్లా చంద్రుని సంచార వ్యవధి అతి తక్కువ. ఒక రాశిలో దాదాపు రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు. విశేషమేమిటంటే భారతీయ పంచాంగం, జాతకం కేవలం చంద్రుని సహాయంతో తయారు చేయబడుతుంది. వారంలోని ఏడు రోజులలో ఒకదానికి సోమవారం అని పేరు పెట్టడం కూడా చంద్రుని ప్రాముఖ్యతను తెలుపుతుంది.

చంద్రుని ద్వారా  ఐశ్వర్యాన్ని పొందే మార్గాలు

చంద్రుని ద్వారా ఐశ్వర్యాన్ని పొందడానికి, సోమవారం రోజున శివలింగానికి పాలు సమర్పించాలి.

సోమవారం నాడు రుద్రాక్ష జపమాలతో ఓం సోమ్ సోమాయ నమః మంత్రాన్ని పఠించడం ద్వారా చంద్రుడి అనుగ్రహం పొందవచ్చు. జాతకంలో చంద్రుని శుభాన్ని తెస్తుంది.

జాతకంలో చంద్ర దోషం తొలగిపోవాలంటే సోమవారం రోజు ఉపవాసం ఉండాలి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం, చంద్రుడిని చూడటం, పూజించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.

చంద్రునికి సంబంధించిన తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులు, తెల్లటి చందనం, బియ్యం, పాలు, వెండి, ముత్యాలు, పంచదార మిఠాయిలు మొదలైన వాటిని దానం చేయడం కూడా  శుభాన్ని కలిగిస్తుంది.

ముత్యాన్ని చంద్రుడికి చిహ్నంగా .. పవిత్ర రత్నంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో.. చంద్రుని  శుభ ఫలితాలను పొందడానికి, చిటికెన వేలికి ముత్యం ఉన్న వెండి ఉంగరాన్ని ధరించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)