Money Astrology: ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం పక్కా.. ! 12 రాశుల వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే..?

Money Astrology in Telugu: ధన యోగం లేదా కుబేర యోగం పట్టాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే రెండు (ధనం), తొమ్మిది (భాగ్యం), పదకొండు (లాభం) స్థానాల అధిపతులు బాగా అనుకూలంగా ఉండాలి. ఈ అధిపతులు ఎటువంటి పరిస్థితులలోనూ దుస్థానాలలో, అంటే 6, 8, 12 స్థానాలలో ఉండకూడదు. ఈ 2,9,11 స్థానాల అధిపతులలో మూడూ అనుకూలంగా ఉంటే లక్ష్మీ కటాక్షం గ్యారంటీ అని చెప్పవచ్చు.

Money Astrology: ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం పక్కా.. ! 12 రాశుల వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే..?
Money Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 15, 2023 | 1:49 PM

Lakshmi Kataksha Yoga: ధన యోగం లేదా కుబేర యోగం పట్టాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే రెండు (ధనం), తొమ్మిది (భాగ్యం), పదకొండు (లాభం) స్థానాల అధిపతులు బాగా అనుకూలంగా ఉండాలి. ఈ అధిపతులు ఎటువంటి పరిస్థితులలోనూ దుస్థానాలలో, అంటే 6, 8, 12 స్థానాలలో ఉండకూడదు. ఈ 2,9,11 స్థానాల అధిపతులలో మూడూ అనుకూలంగా ఉంటే లక్ష్మీ కటాక్షం గ్యారంటీ అని చెప్పవచ్చు. ఏ రెండు స్థానాలు బలంగా ఉన్నా ఆకస్మిక ధన లాభానికి, లాటరీ గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒక అధిపతి మాత్రమే బాగుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగాల పరంగా ఆదాయం పెరగడం జరుగుతుంది. ధన కారకుడైన గురువు అనుకూలంగా ఉంటే మరీ మంచిది. ఈ ఏడాది ఏయే రాశుల వారికి ధన యోగం పట్టేదీ, ఏ స్థాయిలో ధన ప్రాప్తి ఉండేదీ ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశివారికి ఈ ఏడాదంతా ధన కారకుడు, భాగ్యాధిపతి అయిన గురువు బాగా అనుకూలంగా ఉండడం, లాభాధిపతి శనీశ్వరుడు లాభ స్థానంలోనే సంచరిస్తుండడం వల్ల, ధనాధిపతి శుక్రుడు కొంత మేరకు అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది. అయితే, రాహు, కుజుల కారణంగా విచ్చలవిడిగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉన్నందువల్ల లక్ష్మీ కటాక్షం పూర్తి స్థాయిలో సిద్ధించే అవకాశం లేదు. ఖర్చులకు కళ్లెం వేస్తే కోట్లు గడించడం ఖాయం.
  2. వృషభం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి బుధుడు, లాభ స్థానాధిపతి కుజుడు, భాగ్య స్థానాధిపతి అను కూలంగా ఉన్నందువల్ల ధన యోగం ఏర్పడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తికి, అప్రయత్న ధన లాభా నికి అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వృత్తి, వ్యాపారాల వారు అపార ధనం సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే, ధన కారకుడైన గురువు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల శుభ కార్యాలు, సహాయ కార్యక్రమాలు, దైవ కార్యాల మీద బాగా డబ్బు ఖర్చయ్యే సూచనలున్నాయి.
  3. మిథునం: లాభ స్థానంలో గురు, రాహువుల సంచారం, భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శనీశ్వరుడి సంచారం బాగా అనుకూలంగా ఉన్నాయి. కొద్దిపాటి ప్రయత్నంతో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అయితే, ధన స్థానాధిపతి చంద్రుడు అనుకూలంగా లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో కోటీశ్వరు లయ్యే అవకాశం ఉండకపోవచ్చు. అయితే, ధన వృద్ధి మాత్రం తప్పకుండా చోటుచేసుకుంటుంది. ప్రయత్న లోపం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రయత్నాలను మధ్యలో ఆపేయడం కూడా జరుగుతుంది.
  4. కర్కాటకం: ఈ రాశివారికి భాగ్య స్థానాధిపతి అయిన గురువు దశమ కేంద్రంలో ఉండడం, ధన స్థానాధిపతి రవి చాలావరకు అనుకూలంగా ఉండడం వల్ల విపరీతమైన ధన యోగం పట్టడానికి అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి లోపల కోటీశ్వరుడు కావడం ఖాయం అని చెప్పవచ్చు. లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా లేకపోవడం వల్ల అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం కూడా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం పడుతుంది.
  5. సింహం: ఈ రాశివారికి భాగ్యాధిపతి అయిన కుజుడు, ధన, లాభాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడం, భాగ్యస్థానం నుంచి ధన కారకుడైన గురువు దృష్టి ఉండడం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఇబ్బడిముబ్బడిగా ధన సంపాదనకు అవకాశం ఉంది. ఆదాయ మార్గాలన్నీ కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో లక్ష్మీదేవి తప్పకుండా కటాక్షిస్తుంది. అయితే, శుక్ర, రాహువుల సంచారం అనుకూలంగా లేని కారణంగా, కొన్ని సదవకాశాలను చేజార్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
  6. కన్య: ఈ రాశివారికి ధన, భాగ్య స్థానాధిపతి అయిన శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల, లాభ స్థానాధిపతి అయిన చంద్రుడు ప్రతికూలంగా ఉన్నందువల్ల, ధన కారకుడైన గురువు అష్టమ రాశిలో ఉన్నందువల్ల కోటీశ్వరుడు అయ్యే అవకాశం లేదు కానీ, సంపాదన బాగా పెరిగే అవకాశం మాత్రం ఉంది. తరచూ భారీ ఖర్చుల వల్ల కొంత డబ్బు వృథా కావడం జరుగుతుంది. అంతేకాక, ప్రయత్నలోపం, నిర్లక్ష్యం వంటివి కూడా ఆదాయం తగ్గేందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
  7. తుల: భాగ్యాధిపతి, ధన స్థానాధిపతి, లాభ స్థానాధిపతి ముగ్గురూ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు ఈ ఏడాది తప్పకుండా కోటీశ్వరులు కావడానికి, లక్ష్మీకటాక్షానికి పాత్రులు కావడానికి ఎంతగానో అవకాశం ఉంది. అనవసర, అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ ఈ రాశివారు అంచనా లకు మించి ధన సంపాదన చేస్తారనడంలో సందేహం లేదు. ధన కారకుడైన గురువు వీక్షణ కూడా ఉన్నందువల్ల ధన సంపాదనకు సంబంధించి మనసులోని కోరికలు నెరవేరడం జరుగు తుంది.
  8. వృశ్చికం: ఈ రాశివారికి ధనాధిపతి, భాగ్యస్థానాధిపతి అనుకూలంగా లేకపోవడం వల్ల, లాభ స్థానాధిపతి మాత్రం అనుకూలంగా ఉన్నందువల్ల సంపాదన పెరగడమే తప్ప లక్ష్మీ కటాక్షానికి పాత్రులయ్యే అవకాశం లేదు. అవసరానికి సరిపడ డబ్బు అందడం, ఆర్థిక సమస్యలు అదుపులో ఉండడం వంటివి జరిగే అవకాశం ఉంది. ధన కారకుడైన గురువు దుస్థానంలో ఉన్నందువల్ల ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో లేదా ఆశించిన స్థాయిలో ఫలించే అవకాశం ఉండక పోవచ్చు.
  9. ధనుస్సు: ధనాధిపతి శనీశ్వరుడు స్వక్షేత్రంలో బలంగా ఉండడం వల్ల, భాగ్యాధిపతి, లాభాధిపతి, ధన కార కుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారు ఈ ఏడాది తప్పకుండా లక్ష్మీ కటాక్షానికి పాత్రు లయ్యే అవకాశం ఉంది. విపరీత ధన యోగం, అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలోనే కాకుండా ఉద్యోగంలోనూ, అదనపు ఆదాయ ప్రయత్నాల పరంగానూ సంపాదన బాగా పెరిగే సూచనలున్నాయి. వైద్య ఖర్చులు, అనుకోని ఖర్చులకు కూడా అవకాశం లేదు.
  10. మకరం: ఈ రాశికి ధన స్థానాధిపతి, భాగ్యాధిపతి అనుకూలంగా ఉన్నప్పటికీ, లాభ స్థానాధిపతి పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల సంపాదన, ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, పెరిగిన కుటుంబ బాధ్యతల కారణంగా బాగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంది. తోబుట్టువులకు గానీ, కుటుంబ సభ్యుల మీద కానీ ఖర్చు పెట్టవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలకు మించి ధన సంపాదనకు అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది.
  11. కుంభం: ధన, లాభ స్థానాధిపతి అయిన గురువు, భాగ్య స్థానాధిపతి శుక్రుడు కొద్దిగా మాత్రమే అను కూలంగా ఉండడం వల్ల కోటీశ్వరులు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అవసరాలకు సరిపడ డబ్బు అందడానికి, రావలసిన డబ్బు రావడానికి, మొండి బాకీలు వసూలు కావడానికి మాత్రమే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దగా ఖర్చులు మీద పడే అవ కాశం కూడా లేదు. ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడడం, ఆశాజనకంగా ఉండడం జరుగుతుంది.
  12. మీనం: ధన, భాగ్యాధిపతి అయిన కుజుడు అనుకూలంగా ఉన్నప్పటికీ, లాభాధిపతి శనీశ్వరుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల కోటీశ్వరులయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద ఖర్చులు పెట్టడం జరుగుతుంది. మితిమీరిన ఔదార్యంతో దాన ధర్మాలు చేయడం వల్ల, కొందరిని గుడ్డిగా నమ్మడం వల్ల కూడా డబ్బు నష్టం జరుగుతుంది. సంపాదన పెరిగినప్పటికీ, కోటీశ్వరుడు కావాలనే కాంక్ష కొరవడడం వల్ల కుబేరులయ్యే అవకాశం తక్కువ.

Note: ఇక్కడ మేము సమకూర్చిన జ్యోతిష్య సమాచారం పూర్తిగా వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించామని గమనించగలరు.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.