- Telugu News Photo Gallery Success story: hassan police constable earned Rs 20 lakh In Tomato Just two acre Land
Success Story: ఖాళీ సమయంలో టమాటా సాగు చేస్తున్న పోలీసులు.. రూ.20 లక్షల ఆదాయం..
వర్షం తదితర కారణాలతో మార్కెట్‌లో కూరగాయల ధరలు పెరిగాయి. ముఖ్యంగా టమాటా ధర విపరీతంగా పెరిగిపోయింది. ఈసారి టమోటా రైతులు, వ్యాపారులు టమాటా తో లాభాలను అందుకుంటున్నారు. దీంతో రైతులు టమాటా పంటపై ఎక్కువ శ్రద్ధ పెట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే ఓ వ్యక్తి ఓ వైపు పోలీసు గా విధులను నిర్వహిస్తూనే మరోవైపు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని టమాటా పండించి లక్షలు సంపాదిస్తున్నాడు.
Updated on: Jul 15, 2023 | 12:04 PM

హాసన్‌కు చెందినభైరేష్ అనే పోలీసు కమ్ రైతు కేవలం ఒక ఎకరంలో టమోటా సాగు చేసి 20 లక్షలకు పైగా లాభం పొందాడు. ఇప్పటి వరకు తనకున్న పొలంలో టమాటా పందిస్తున్నాడు., దిగుబడి 1000 బాక్సుల టమాటా వచ్చింది. బైరేష్.. ఇప్పటి వరకు 16 లక్షలకు పైగానే సంపాదించాడు.

పోలీసు డ్యూటీతో పాటు వ్యవసాయం చేస్తూ లక్షాధికారి అయ్యాడు. బేలూరు తాలూకా హళేబీడు హోబలిలోని బస్తీహళ్లి గ్రామానికి చెందిన బైరేష్ హసన్ మొబైల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వ్యవసాయం మీద ఉన్న ఆసక్తితో ఖాళీ సమయుంలో పొలంలో పంటలను పండిస్తూ ఉంటాడు. ఈసారి టమోటా పంటతో మంచి ఆదాయాన్ని పొందాడు.

మొదటి సారి టమాట దిగుబడి వచ్చినప్పుడు ఒక్కో బాక్సు రూ.900, రెండో బీడీలో రూ.1200 చొప్పున విక్రయించాడు. మూడు, నాల్గవ పంటలో పెట్టెకు 1600 రూపాయలు, 5వ పంటకు పెట్టెకు 1950 రూపాయలు, ఆరవ పంటకు 1750 రూపాయలకు అమ్మగా ఇప్పుడు ఏడవ పంట దిగుబడి సమయంలో బాక్స్ 2000 రూపాయలుంది.

ఒక్కో పంటలో ఒకొక్క బాక్స్ 28 కిలోల బరువు చొప్పున ఇప్పటి వరకు 1000 బాక్సులకు పైగా టమాటను విక్రయించారు. ఇంకా మరో ఏడు సార్లు దిగుబడి వచ్చేటంత టమాటా పంట ఉంది. దీంతో బైరేష్ మరిన్ని లాభాలను అందుకునే అవకాశం ఉంది.

మూడు లక్షలు వెచ్చించి ఎకరం, ఆరు గుంటల్లో టమాట సాగు చేసిన బైరేష్.. తాను వ్యవసాయం చేయడానికి పెట్టిన ఖర్చును తీసివేస్తే ఇరవై లక్షల ఆదాయం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

టమాటా దొంగిలించబడకుండా పగలు, రాత్రి కాపలా కాస్తూ, పంటను కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు టమాటాకు బంపర్ ధర లభించినందుకు ఆనందంగా ఉన్నారు. కనీసం బాక్స్ ను 1000 రూపాయలకు అమ్మినా.. 67 లక్షల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నానని చెప్పాడు భైరేష్.




