Hanuman Jayanti 2025: హనుమాన్ జయంతి రోజున ఏర్పడనున్న అనేక అరుదైన యాదృచ్చికాలు.. ఈ రాశులపై లక్ష్మీదేవి కటాక్షం..
దేశవ్యాప్తంగా హనుమంతుడి జన్మదినోత్సవ పండుగను వైభవంగా జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఈ రోజున హనుమంతుడి ఆలయంలో రామచరితమానస్ , హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. ఈ ఏడాది హనుమంతుడి జన్మదినోత్సవం రోజున కొన్ని అరుదైన యాదృచ్చిక సంఘటనలు ఏర్పదనున్నాడు. దీంతో కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కనుక ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారం బజరంగబలి హనుమంతుడి జన్మదినోత్సవం చైత్ర మాసం పౌర్ణమి రోజున జరుపుకోనున్నారు. పురాణాల ప్రకారం ఈ రోజున హనుమంతుడు కేసరి, అంజని దంపతులకు జన్మించాడు. హనుమంతుడితో పాటు రాముడిని, సీతాదేవిని పూజించడం శుభప్రదం. ఈసారి హనుమంతుడి జన్మదినోత్సవం ఏప్రిల్ 12న వచ్చింది. అంతేకాదు ఈ రోజున అనేక అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరుగనున్నాయి. అటువంటి పరిస్థితిలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి. దీని కారణంగా ఆ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక లాభాలతో పాటు కెరీర్, వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంది.
హనుమంతుడి జన్మదినోత్సవం రోజున ఏ అరుదైన యాదృచ్చికం ఏర్పడనున్నదంటే
పంచాంగం ప్రకారం ఈసారి చైత్ర మాసంలో పౌర్ణమి తిధి ఏప్రిల్ 12వ వచ్చింది. ఈ రోజున హనుమంతుడి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే పంచాంగం ప్రకారం రవి, జయ యోగ, హస్త, చిత్ర జరుపుకుంటారు. అంతేకాదు ఈ రోజు బుధుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, సూర్యుడు మీన రాశిలో ఉంటారు. దీనితో పాటు బుధాదిత్య, శుక్రాదిత్య, లక్ష్మీ నారాయణ, మాలవ్య రాజయోగం మీన రాశిలో ఏర్పడుతోంది. దీంతో మొత్తం 12 రాశులపై ప్రభావం చూపించినా.. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు మాత్రం ఎంతో ప్రయోజనం పొందబోతున్నారు.
ఏ రాశుల వారికి అదృష్టం అంటే
వృషభ రాశి: హనుమంతుడి జన్మదినోత్సవం రోజున వృషభ రాశి వారు బజరంగబలి అపారమైన ఆశీర్వాదాలను పొందుతారు. ఈ సమయంలో వృషభ రాశి వారి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభించవచ్చు. ప్రతి రంగంలో విజయంతో పాటు ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో రావలసిన డబ్బులు వస్తాయి. అలాగే పెట్టుబడి పెట్టిన మూలధన డబ్బులు పెరుగుతాయి.
మిథున రాశి: హనుమాన్ జయంతి రోజున అరుదైన యాదృచ్చికం కారణంగా మిథున రాశి వారిపై బజరంగబలి ఆశీర్వాదం ఉండనుంది. ఈ సమయంలో మిథున రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక లాభం కోసం మెరుగైన మార్గాలను ఎంచుకుంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీరు వృత్తి, వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ఆర్థిక లాభం పొందనున్నారు, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కుంభ రాశి: కుంభ రాశి వారికి హనుమాన్ జయంతి ఆనందాన్ని బహుమతిగా తీసుకువస్తోంది. ఈ కాలంలో కుంభ రాశి వ్యక్తులు అపారమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు. కెరీర్ పరంగా చాలా ప్రయోజనాలు పొందనున్నారు. వ్యాపారస్తులు పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అంతేకాదు శుభవార్త వినే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








