AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit: ఈ నెల 14 మేష రాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు.. ఈ ఐదు రాశులకు నెల రోజుల పాటు అదృష్టమే అదృష్టం..

నవ గ్రహాలకు రారాజు.. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు ఈ నెలలో మేషరాశిలో అడుగు పెట్టనున్నాడు. ఇక్కడ నెల రోజుల పాటు ఉండనున్నాడు. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని రాశిలో మార్పు కారణంగా ఐదు రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది. సూర్యుడి ఆశీస్సులు ఉండే ఆ ఐదు రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Sun Transit: ఈ నెల 14 మేష రాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు.. ఈ ఐదు రాశులకు నెల రోజుల పాటు అదృష్టమే అదృష్టం..
Sun Enters Aries April 14
Surya Kala
|

Updated on: Apr 09, 2025 | 4:53 PM

Share

సూర్యుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఈ నేపధ్యంలో గ్రహాల గణన ఆధారంగా సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మేషరాశిలో సంచరించేందుకు అడుగు పెట్టనున్నాడు. ఈ రోజున సూర్యుడు తన ఉచ్ఛ రాశి మేష రాశిలో సంచరించనున్నాడు. దీంతో మొత్తం రాశులపై ప్రభావం చూపించినా.. ఐదు రాశుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా మేష రాశి వారు దీని వల్ల ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు.

మేష రాశి:

సూర్యుడు తన స్నేహితుడైన మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. వాస్తవానికి మేష రాశి అధిపతి కుజుడు. సూర్యుడు, కుజుడు స్నేహితులు కనుక మేష రాశికి సూర్యుడి మధ్య మంచి స్నేహం ఉంది. అటువంటి పరిస్థితిలో సూర్యుని సంచారం ఈ రాశికి వారి అనేక ప్రయోజనాలను తెస్తుంది. దీనితో పాటు మేష రాశి సంచారములో సూర్యుడు కూడా బలపడతాడు. సూర్య దేవుడు అగ్ని తత్వానికి చెందిన గ్రహం.. మేష రాశి కూడా అగ్ని తత్వానికి సంకేతం. సూర్యుడు తన ఉచ్ఛ రాశిలోకి ప్రవేశించడంతో.. మేషం, సింహ, కుంభం, ధనుస్సు, తుల రాశులకు చెందిన వారికి శుభప్రదంగా ఉండనుందని పండితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ 5 రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి.

ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలోకి అడుగు పెట్టడంతో మేష సంక్రాంతి ఏప్రిల్ 14న వచ్చింది. మేష రాశి స్నేహపూర్వక రాశి కావడంతో మేషరాశిలో సూర్యుని సంచారంవలన మేషం, సింహ, కుంభం, ధనుస్సు, తుల రాశులకు శుభ ఫలితాలను ఇవ్వబోతోంది.

మేష రాశి వారు సూర్యుడిలా ప్రకాశిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు గౌరవం, ప్రతిష్ట, ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాలకు కారకంగా పరిగణించబడ్డాడు. అటువంటి పరిస్థితిలో మేషరాశిలో సూర్యుని సంచారం మేష రాశి వారికి అత్యంత శుభ ఫలితాలను తెస్తుంది. మేష రాశి వారు తమ కెరీర్ లేదా వ్యాపారంలో విజయాన్ని అందుకోగలరు. అదే సమయంలో వీరు తమ సమయాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి వారికి పూర్వీకుల ఆస్తి ప్రయోజనం సింహ రాశి వారికి సూర్యుడు లగ్నానికి అధిపతి. అటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులతో వీరి సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారతాయి. దీనితో పాటు వీరు పూర్వీకుల ఆస్తి ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. దీనితో పాటు వీరు కష్టపడి చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి వారు ఆధ్యాత్మికత వైపు మొగ్గు ఈ నెల రోజులు ధనుస్సు రాశికి చెందిన వారు ఆధ్యాత్మికత వైపు పయనిస్తారు. భగవంతుడి సన్నిధిలో తమ సమయాన్ని గడుపుతారు. అదే సమయంలో ఈ రాశికి చెందిన స్టూడెంట్స్ తమ ఉన్నత విద్యను అభ్యసించేందుకు మార్గం లభిస్తుంది.

కుంభ రాశి వారి కెరీర్ ఊపందుకుంటుంది. కుంభ రాశి వారి జన్మ కుండలిలో సూర్యుడు ఏడవ ఇంటికి అధిపతి. కుంభ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి కెరీర్‌లో మెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ కు సంబంధించిన వార్తలు కూడా వినే అవకాశం ఉంది.

తుల రాశి వారు వ్యాపారంలో విజయం సాధిస్తారు. తుల రాశి వారికి సూర్యుడు లాభ గృహానికి అధిపతి. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారం సూర్యుడిలా పెరుగుతుంది. అయితే లావాదేవీల ను తగిన జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పది విధాలుగా ఆలోచిస్తే వ్యాపారంలో కొత్త ఎత్తులను చేరుకోగలరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.