AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa Movie: కన్నప్ప రిలీజ్ డేట్‌ని ప్రకటించిన సిఎం యోగి.. గొప్ప సినిమాగా నిలిచిపోతుందన్న మోహన్ బాబు

మంచు విష్ణు హీరోగా ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న కన్నప్ప సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే మంచు విష్ణు సినిమా ప్రమోషన్స్ ను సార్ట్ చేశాడు. అందులో భాగంగానే మంచు విష్ణు సహా చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. సిఎం యోగి సమక్షంలో కన్నప్ప సినిమా పోస్టర్ ను అవిష్కరించారు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.

Kannappa Movie: కన్నప్ప రిలీజ్ డేట్‌ని ప్రకటించిన సిఎం యోగి.. గొప్ప సినిమాగా నిలిచిపోతుందన్న మోహన్ బాబు
Vishnu Manchu's Kannappa
Surya Kala
|

Updated on: Apr 09, 2025 | 3:16 PM

Share

మంచు విష్ణు హీరోగా తెర‌కెక్కిన క‌న్న‌ప్ప సినిమా రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మంచు విష్ణు ప్ర‌మోష‌న్స్ ను స్పీడ‌ప్ చేశాడు. తాజాగా కన్నప్ప సినిమాను నిర్మించిన పవర్‌హౌస్ బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలో కలిసింది. ఈ ప్రతినిధి బృందానికి నటుడు, నిర్మాత మోహన్ బాబు నాయకత్వం వహించగా.. విష్ణు మంచు, ప్రభుదేవా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వినయ్ మహేశ్వరి ఉన్నారు. ఈ సందర్భంగా సిఎం యోగీకి భక్త కన్నప్ప గురించి .. సినిమా నేపధ్యం గురించి చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాదు ముఖ్యమంత్రి సమక్షంలో కన్నప్ప బృందం సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు. దీనితో పాటు సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్ డేట్ ను వెల్లడించారు. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని అధికారికంగా ప్రకటించారు. కన్నప్ప చిత్ర బృందం భారతీయ సినిమా క్యాలెండర్‌లో ఒక గొప్ప సినిమాగా నిలిచిపోతుందని చెప్పారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి యోగికి సినిమా నిర్మాణానికి సంబందించిన చిన్న వీడియో క్లిప్ ని చూపించారు. భక్త కన్నప్ప పురాణాన్ని ప్రాణం పోసేందుకు పరిపూర్ణ స్థాయిలో భక్తితో సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. వీడియో చూసిన సీఎం యోగి.. చిత్రం బృందం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. భారతీయ పురాణాలు, సంస్కృతి, భక్తికి సంబందించిన కథలను సినిమాల ద్వారా చెప్పడంలో ఉన్న ప్రాముఖ్యతను చెప్పారు.

ఈ సందర్భంలో కన్నప్ప సినిమాను ఒక్కసారి చూడాలని మోహన్ బాబు కోరారు. అంతేకాదు మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్య, వారసత్వ కేంద్రంగా నిలుస్తున్న తిరుపతిని సందర్శించాలని కన్నప్ప బృందం సీఎం యోగికి హృదయపూర్వక ఆహ్వానం పలికింది.

ఇవి కూడా చదవండి

ఈ సమావేశం గురించి విష్ణు మంచు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కలవడం మనందరికీ ఎంతో గౌరవప్రదమైన క్షణం. నటుడిగా తన జీవితం క‌న్న‌ప్ప‌కు ముందు, క‌న్న‌ప్ప‌కు త‌ర్వాత అన్న‌ట్టు మారింద‌ని మంచు విష్ణు చెప్పారు. క‌న్న‌ప్ప సినిమా త‌న‌కొక బేబీ లాంటిద‌ని విష్ణు తెలిపాడు. కన్నప్ప కేవలం ఒక కథ కాదని.. ఇది ఒక సాంస్కృతిక పునరుత్థానం అని అర్థం చేసుకున్నట్లు చెప్పాడు. ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

జూన్ 27, 2025న విడుదల కానున్న కన్నప్ప సినిమా శివ భక్తుడి కథను వివరించే చారిత్రక ఇతిహాసం. అద్భుతమైన తారాగణం, ఉత్కంఠభరితమైన విజువల్స్ తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ హామీ ఇచ్చింది. విష్ణు మంచు కన్నప్పగా, ప్రీతి ముఖుందన్‌గా నటించారు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితరులు ప్రధాన తారాగణం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..