Lucky Zodiac Signs: గురు మూఢమిలో ఈ రాశులకు అదృష్ట యోగాలు పట్టబోతున్నాయ్..!
Telugu Astrology: జూన్10 నుండి జులై 8 వరకు గురు మూఢమి కాలం. ఈ సమయంలో శుభకార్యాలు నివారించాలి. కానీ వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం, ఉద్యోగ పదోన్నతులు, ఆదాయ వృద్ధి, ధనయోగాలు వంటి అంశాలు ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటాయి.

Lucky Zodiac Signs
ఈ నెల(జూన్) 10 నుంచి జూలై 8 వరకూ గురు మూఢమి ఏర్పడుతోంది. రవి, గురువులు సన్నిహితం అయినప్పుడు గురువు బలహీనపడి గురు మూఢమి ఏర్పడుతుంది. గురువు శుభ కార్యాలకు, గృహానికి, ధనానికి కారకుడైనందువల్ల మూఢమి సమయంలో పెళ్లి, శోభనం, శంకుస్థాపన, గృహ ప్రవేశం, ఉపనయనాలు, అక్షరాభ్యాసం వంటి శుభ కార్యాలు చేయకూడదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. మూఢమి రోజుల్లో శుభ కార్యాలు తప్ప మిగతా విషయాల్లో రవి, గురువుల అనుకూలతలు పెరుగుతున్నందు వల్ల వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశులకు కొన్ని అదృష్ట యోగాలు పట్టే వచ్చే అవకాశం ఉంది.
- వృషభం: గురువు మీద రవి ప్రభావం పడడం వల్ల ఈ రాశివారికి ఆస్తి సమస్యలు పరిష్కారం కావడం, ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, సొంత ఇల్లు అమరడం, సామాజిక హోదా లభించడం, కీర్తి ప్రతిష్ఠలు పెరగడం జరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు తిరుగుండదు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంపద, సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయి.
- సింహం: రాశ్యధిపతి రవికి గురువు సన్నిహితం కావడం వల్ల ఆర్థికంగా కలలో కూడా ఊహించని అదృష్టాలు కలుగుతాయి. ఈ రాశివారికి ధన యోగాలతో కూడిన రాజయోగం పట్టే అవకాశం ఉంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, మదుపులు, పెట్టుబడుల వల్ల అత్యధికంగా ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగుల పంట పండుతుంది.
- కన్య: ఈ రాశికి దశమ స్థానం మీద మూఢమి ప్రభావం పడుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. మరింత మంచి సంస్థలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వారసత్వ సంపద సమకూరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడించడం జరుగుతుంది.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో మూఢమి చోటు చేసుకుంటున్నందువల్ల కలలో కూడా ఊహించని అదృష్టం పట్టే అవకాశముంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అఫర్లు అందివస్తాయి.
- ధనుస్సు: సప్తమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువు మీద భాగ్యాధిపతి రవి ప్రభావం పడినందువల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. రోజుకో విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి సంబంధం కుదరడం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- కుంభం: ఈ గురు మూఢమి ఈ రాశివారికి యోగదాయక కాలం అవుతుంది. ఆదాయం పెరగడంతో పాటు అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పు వస్తుంది. అనేక వైపుల నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఉద్యోగ జీవితం పదోన్నతులు, భారీ జీతభత్యాలతో కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి.