Gaja Lakshmi Yoga: అనుకూలంగా 3 శుభగ్రహాలు.. ఆ రాశుల వారికి గజలక్ష్మీ యోగం..! ఆర్థికంగా అన్ని శుభాలే..
గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నప్పుడు గజలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. సాధారణంగా ఈ శుభ గ్రహాలలో ఏ ఒక్క గ్రహం అనుకూలంగా ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అటువంటిది ఈ మూడు శుభ గ్రహాలూ అనుకూలంగా ఉన్న పక్షంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం అనేది తప్పకుండా జరుగుతుంది. శుభ గ్రహాల అనుకూలత ఏప్రిల్ చివరి వరకూ కొనసాగుతుంది.
గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నప్పుడు గజలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. సాధారణంగా ఈ శుభ గ్రహాలలో ఏ ఒక్క గ్రహం అనుకూలంగా ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అటువంటిది ఈ మూడు శుభ గ్రహాలూ అనుకూలంగా ఉన్న పక్షంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం అనేది తప్పకుండా జరుగుతుంది. శుభ గ్రహాల అనుకూలత ఏప్రిల్ చివరి వరకూ కొనసాగుతుంది. అందువల్ల ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ ప్రయత్నాల మీద ఎంత ఎక్కువగా శ్రద్ధ పెడితే అంతగా ఈ గజలక్ష్మీ యోగం అనుభవానికి వస్తుంది. ఏయే రాశుల వారికి ఈ యోగం పడుతోందో ఇక్కడ పరిశీలిద్దాం.
- వృషభం: ఈ రాశివారికి ప్రస్తుతం శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల గజలక్ష్మీ యోగం ఏర్పడింది. దీని ఫలితంగా ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన ప్రాప్తికి అవకాశం కలిగింది. ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి, ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడానికి, ఆదాయ ప్రయత్నాలను పెంచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామికి కూడా సంపద కలిసి వస్తుంది. లాభదాయక వ్యాపార ఒప్పందాలు కుదర్చుకోవడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశివారికి భాగ్య, దశమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల కెరీర్ ద్వారా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. గజలక్ష్మీ యోగ ప్రభావం వల్ల ఉద్యోగులకు ఊహించని విధంగా జీతభత్యాలు పెరగడం, అదనపు రాబడికి అవకాశాలు ఏర్పడడం, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగి, లాభాలు అంచనాలకు మించడం వంటివి జరుగుతాయి. తప్పకుండా ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరిగి, జీవితం కొన్ని సానుకూల మలుపులు తిరుగుతుంది.
- తుల: ఈ రాశివారికి 5,6,7 స్థానాల్లో గురు, శుక్ర, బుధ గ్రహాల సంచారం వల్ల అద్భుతమైన గజలక్ష్మీ యోగం ఏర్పడింది. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ధికి వీలైనన్ని ప్రయత్నాలు చేయడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అయి, బాగా సంపద కలిసి వస్తుంది. లాటరీలు, షేర్లు, స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీల వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశ ముంది.
- ధనుస్సు: ఈ రాశికి శుభ గ్రహాల కారణంగా పట్టిన గజలక్ష్మీ యోగం వల్ల అధికారంతో కూడిన ఆదాయ వృద్ధికి అవకాశం ఏర్పడింది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వీరికి విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి అధికారయోగం పడుతుంది. మొత్తానికి కెరీర్ పరంగా ఈ రాశివారికి బాగా సంపద పెరిగే సూచనలున్నాయి. లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి.
- మకరం: ఈ రాశివారికి శుభ గ్రహాల స్థితిగతుల కారణంగా అంచనాలకు మించి ఆదాయం పెరగడానికి, ఆర్థిక స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం కలిగింది. ఆదాయం పెరగడమే తప్ప తరగడం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతే తప్ప తిరోగమనానికి అవకాశం ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా తప్పకుండా సఫలం అవుతుంది. గృహ, వాహన యోగాలకు కూడా అవకాశముంది. అనూహ్యంగా సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- కుంభం: ఈ రాశివారికి ప్రస్తుతం మూడు శుభ గ్రహాలూ బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం పరి స్థితిని పెంచుకోవడానికి, ఆర్థిక సంబంధంగా మనసులోని కోరికలను చాలావరకు నెరవేర్చుకోవ డానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రయత్నపూర్వకంగానే కాకుండా, అప్రయత్నంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి కలిసి వస్తుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి.