Gajakesari Yoga: రెట్టింపు బలంతో గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Telugu Astrology: ఈ నెల (ఫిబ్రవరి) 6, 7, 8 తేదీల్లో వృషభ రాశిలో గురు, చంద్రుల కలయిక జరగబోతోంది. గురు, చంద్రులు ఒకే రాశిలో కలవడాన్ని గజకేసరి యోగం అంటారు. వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ గజకేసరి యోగానికి రెట్టింపు బలం కలిగింది. ఈ మూడు రోజుల కాలంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు, తలపెట్టే ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తాయి.

Gajakesari Yoga
ఈ నెల (ఫిబ్రవరి) 6, 7, 8 తేదీల్లో వృషభ రాశిలో గురు, చంద్రుల కలయిక జరగబోతోంది. గురు, చంద్రులు ఒకే రాశిలో కలవడాన్ని గజకేసరి యోగం అంటారు. వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛపడు తున్నందువల్ల ఈ గజకేసరి యోగానికి రెట్టింపు బలం కలిగింది. ఈ మూడు రోజుల కాలంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు, తలపెట్టే ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. ఇవి తప్పకుండా అత్యత్తమ ఫలితాలనిస్తాయి. అనేక విజయాలు, సాఫల్యాలతో పాటు, ఆకస్మిక ధన యోగాలు, పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. ఈ గజకేసరి యోగం ప్రస్తుతం మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులవారికి అత్యంత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సపలం అవు తుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల బంధుమిత్రులు, అధికారులు బాగా లబ్ధి పొందుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు.
- వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడం, పైగా గురువుతో కలవడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టే పెట్టుబడుల వల్ల విశేష లాభాలు కలుగుతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. అనారోగ్యాల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరు గుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. దైవ కార్యాలు, సమాజ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందు తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో గురు, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల విదేశీయానానికి ఆటం కాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నవారికి స్థిరత్వం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అపారంగా పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల కుటుంబంలోనూ, దాంపత్య జీవితంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల విశేష లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పడుతుంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల విజయాలు, సాఫ ల్యాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు బాగా రాణిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. షేర్ల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, నిర్ణయం తీసుకున్నా తప్పకుండా విజయవంతం అవుతాయి.