Gajakesari Yoga: గజకేసరి యోగంతో వారి జీవితాల్లో సానుకూల మలుపు.. మీ రాశికి ఎలా ఉంటుందంటే..?
ఈ నెల 26, 27 తేదీల్లో గ్రహ సంచారంలో అరుదైన గజకేసరి యోగం చోటు చేసుకుంటోంది. మేష రాశిలో గురు గ్రహ సంచారం జరుగుతున్న సమయంలో తులా రాశిలో చంద్ర సంచారం జరగడం వల్ల, ఈ రెండు గ్రహాలు పరస్పర వీక్షణ కలిగి ఉన్నందువల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది.
Zodiac Signs: ఈ నెల 26, 27 తేదీల్లో గ్రహ సంచారంలో అరుదైన గజకేసరి యోగం చోటు చేసుకుంటోంది. మేష రాశిలో గురు గ్రహ సంచారం జరుగుతున్న సమయంలో తులా రాశిలో చంద్ర సంచారం జరగడం వల్ల, ఈ రెండు గ్రహాలు పరస్పర వీక్షణ కలిగి ఉన్నందువల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. జాతక చక్రంలో మొట్టమొదటి స్థానంలో ఈ యోగం ఏర్పడడం అనేది శుభ సూచకం. ఈ యోగం వల్ల వివిధ రాశుల వారి జీవితాల్లో తప్పకుండా ఏదో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవితం ఒక సానుకూల మలుపు తిరుగుతుంది. ఈ యోగం రెండు రోజులు మాత్రమే కొనసాగుతున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏ విధమైన శుభ పరి ణామం అన్నది ఇక్కడ అధ్యయనం చేద్దాం.
- మేషం: ఈ రాశిలోనే గజకేసరి యోగం పట్టబోతున్నందువల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలపరంగా, ఆర్థికపరంగా తప్పకుండా అదృష్టం పడుతుంది. ఉద్యోగంలో పురోగతి చెందడానికి ఏవైనా ఆటం కాలు, అడ్డంకులు ఉన్నపక్షంలో అవి వాటంతటవే తొలగిపోతాయి. శత్రుజయం కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయం సాధిస్తుంది. ప్రయత్నాలతో సంబంధం లేకుండానే అవసరం లేకుండానే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కార్యసిద్ధికి అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశివారికి అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆశించిన ప్రయోజనాలు అనుభవానికి వస్తాయి. కోర్టు సమస్యలు కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తికి, సంపదకు, దాచుకున్న డబ్బుకు విలువ పెరుగుతుంది. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆటంకాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల, ఏ రంగానికి చెందినవారైన ప్పటికీ, ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ రాశివారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా వృత్తి, ఉద్యోగాలలో స్థిరపడడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడం వంటివి జరుగుతాయి.వ్యాపారపరంగా జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
- కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో ఈ యోగం ఏర్పడుతున్నందువల్ల కెరీర్ పరంగా ఈ రాశివారికి సమయం అనుకూలంగా ఉండబోతోందని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో ముందుకు దూసుకుపో వడం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా మంచి ఫలితాలనిస్తాయి. గజకేసరి యోగం పట్టిన రెండు రోజుల్లో ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా ఫలిస్తుంది. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్లాన్లను ఆచరణలో పెట్టడం మంచిది. శుభవార్తలకు అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి నవమ స్థానంలో అంటే భాగ్య స్థానంలో ఈ యోగం పట్టడం వల్ల విదేశీయానానికి ఆస్కారం ఏర్పడుతోంది. వీసా సమస్యలు,శాశ్వత నివాసానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్న పక్షంలో అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. పిల్లల అభివృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు, ప్రణాళికలు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. ఉన్నత విద్యకు అవకాశాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
- కన్య: ఈ రాశికి కుటుంబ స్థానంలో ఈ యోగం పడుతున్నందువల్ల, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం, కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడడం, భార్యాభర్తల మధ్య విభేదాలు సమసి పోవడం వంటివి జరుగుతాయి. ధన వృద్ధికి, సంపద వృద్ధికి అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగు తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ మాట సర్వత్రా చెల్లుబాటు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కలలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారం అనుకూలిస్తుంది.
- తుల: ఈ రాశిలో ఉన్న చంద్రుడితో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కలిసి రావడం, శుభవార్తలు వినడం, ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరగడం, శత్రు జయం వంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత ఏర్పడుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. అధికారానికి అవకాశం ఉంటుంది.
- వృశ్చికం: ఈ రాశికి ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. తోబుట్టువులతో వివాదాలు, విభేదాలు పరి ష్కారం అవుతాయి. ఉద్యోగంలో మాటకు, చేతకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యం నుంచి కోలుకోవడం జరుగుతుంది. సరైన వైద్యం, సరైన చికిత్స అందుబాటులోకి వస్తాయి. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవు తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా మారుతాయి. మంచి పేరు ప్రఖ్యాతులు ఏర్పడతాయి.
- ధనుస్సు: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. లాటరీలు, షేర్లు, వడ్డీలు, జూదాలు వంటి అంశాలలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువ లాభం పొందడానికి అవకాశాలున్న రియల్ ఎస్టేట్, రాజకీయాలు వంటి రంగాలలోఝో ఉన్నవారు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త ప్రయత్నాలు, ప్రణాళి కల వల్ల లాభం పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు సకాలంలో పూర్తవుతాయి.
- మకరం: ఈ రాశివారికి గజకేసరి యోగం బాగా వర్తించబోతోంది. గౌరవమర్యాదలు పెరుగుతాయి. ప్రత్యేక మైన గుర్తింపు ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలలోనూ, కుటుంబంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారం సానుకూలంగా ముందుకు వెడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.
- కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో యోగం పడుతున్నందువల్ల తప్పకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం, విదేశీ యానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడం వంటివి జరుగుతాయి. ఆర్థికపరంగా అదృష్టం కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అతి ముఖ్యమైనే పెండింగ్ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి.
- మీనం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో ఈ యోగం ఏర్పడడం విశేషం. కుటుంబంలో శుభకార్యాలకు మార్గం సుగమం కావడం, ధనం వృద్ధి చెందడం, సంతానం కలిగే అవకాశాలు కనిపించడం వంటివి జరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడు తాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. కోర్టు కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారం అవు తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.