Horoscope Today: వారికి పుష్కలంగా మిత్రుల అండదండలు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..
Horoscope Today (25th July): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో అధికారులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో కూడా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. పిల్లల చదువుల విషయంలో మంచి సమాచారం అందుతుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉంటుంది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. నిరు ద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఇంటికి అవసరమైన వస్తువులతో పాటు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు సకా లంలో పూర్తవుతాయి. ఇంటా బయటా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అను కూలంగా ఉంటాయి. వాహన యోగం ఉంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, వ్యాపారాలకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో ఇతరుల కంటే ముందుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి ఉంటుంది. అయితే, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామితో తొందర పాటుతో మాట్లాడడం మంచిది కాదు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కదిద్దు తారు. వ్యక్తిగత సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.



కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ అభిప్రాయాలు ఉపయోగ పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. తలపెట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందడం మంచిది కాదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆదాయం కన్నా ఖర్చు అధికమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ముందుకు సాగుతున్నా సరైన ఫలితం ఉండకపోవచ్చు. కొద్దిగా అనారోగ్య సమస్య బాధపెడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఎటువంటి ఒడిదుడు కులూ లేకుండా ముందుకు వెడతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాలలో ఇబ్బంది పడతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): సామాజికంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక లాభముంటుంది. ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. ఇంట్లో దైవ కార్యాలు నిర్వహిస్తారు. సంతానానికి సంబంధించి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ వ్యవహారాలకు బంధువులను, మిత్రులను దూరంగా ఉంచడం మంచిది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో అటు అధికారులు, ఇటు సహోద్యోగుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తి నిపుణులకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం బాగా పెరుగు తుంది. వ్యాపారాలకు ఢోకా ఉండదు. ఇంటా బయటా మాట చెల్లుబాటు అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. సోదరులతో విభేదాలు సమసిపోతాయి. కుటుంబ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రుల అండదండలతో పనులు పూర్తవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. కానీ, వృథా ఖర్చులు మాత్రం అదుపు లేకుండా సాగిపోతాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇతరుల విమర్శలను పట్టించు కోవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుం టాయి. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రతిఫలాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం కూడా చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు మీద పడుతుంటాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. కొందరు స్నేహితుల సహాయ సహాకారాలతో కొన్ని కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): జీవిత భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒకరిద్దరికి సహాయం చేయడం జరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. వృత్తి జీవితం సీదా సాదాగా సాగిపోతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రతిఫలం లేని పనులను కూడా చేయాల్సి వస్తుంది. వ్యాపా రాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందు తాయి. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయ ప్రయత్నాల విషయంలో లోటు పాట్లను అధిగమిస్తారు. వ్యాపారంలో కొద్దిగా పోటీ పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక సేవా కార్య క్రమంలో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యవహారా లన్నీ సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలలో ఆశించిన ఫలి తాలను సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.



