Telugu Astrology: అయిదు గ్రహాల అనుకూలత.. మరో రెండు నెలలు ఈ రాశులిదే హవా..!
Lucky Zodiac Signs: ఆగస్టు 28 వరకు వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి శుభ గ్రహాల అనుకూల సంచారం అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా అభివృద్ధి చూడడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కోరికలు నెరవేరుతాయి. అయిదు గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశుల వారి హవా రెండు మాసాలు నెలకొంటుంది.

Zodiac Signs
ప్రధాన శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల ఆగస్టు 28 వరకూ వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులదే హవా కాబోతోంది. ఈ రాశులవారి జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపోవడానికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరడం, సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం, ఒత్తిడి తగ్గడం, ఆరోగ్యం కుదుటపడడం, అంచనాలకు మించిన పురోగతి వంటివి వీరి జీవితాల్లో తప్పకుండా అనుభవానికి వస్తాయి. మూడు శుభ గ్రహాలతో పాటు ఏకంగా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వీరి జీవితం సుఖమయం కాబోతున్నాయి.
- వృషభం: ఈ రాశికి బుధ, గురు, శుక్రులతో పాటు శని, కుజ, రాహువులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి జీవితం సుఖ సంతోషాలతో, సంతృప్తికరంగా సాగిపోతుంది. జీవితంలో ఎన్నడూ చూడనంత లక్ష్మీ కటాక్షం వీరికి కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా వీరి ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు శుభవార్తలు, శుభ పరిణామాలతో నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. కొన్ని ఆశలు, కలలు నెరవేరుతాయి.
- సింహం: గురువు, శుక్రుడు, కుజుడు, కేతువు, రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి అష్టమ శని దోషం కూడా వర్తించదు. ఆదాయం బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- తుల: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు, గురు, బుధ, కుజ, రవి, శనులు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి జీవితం సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో ముందుకు సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంత మెరుగైన స్థాయికి చేరుకుంటుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి రాహువు, రాశ్యధిపతి గురువు, రవి, కుజుడు, కేతువు బాగా అనుకూలంగా మారినందు వల్ల అర్ధాష్టమ శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. జీతభత్యాలు, లాభాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- మకరం: ఈ రాశికి రాశ్యధిపతి శనితో పాటు శుక్రుడు, బుధుడు, రవి, రాహువులు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. తప్పకుండా సొంత ఇంటి కల సాకారం అవుతుంది.
- కుంభం: ఈ రాశికి గురువు, శుక్రుడు, రవి, కుజుడు, రాహువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఆదాయం అనేక మార్గాల్లో ఇబ్బడిముబ్బ డిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సొంత ఇంటి యోగం పడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.



